బాహుబలిని మించిపోయిన ఆర్ఆర్ఆర్.. ఇక్కడే రూ.348 కోట్లు..?

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి, బాహుబలి 2 సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలవడంతో పాటు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించిన సంగతి తెలిసిందే.బాహుబలి 2 సినిమాకు అప్పట్లో సౌత్ స్టేట్స్ కు 215 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.2017 సంవత్సరంలో ఆ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ తో బాహుబలి 2 సినిమా విడులకు ముందే రికార్డులను సొంతం చేసుకుంది.

 Rrr Movie Pre Release Business South India States Details,tollywood.pre Relese,r-TeluguStop.com

ప్రస్తుతం రాజమౌళి చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమా కూడా విడుదలకు ముందే అరుదైన రికార్డులను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.

ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో ఆర్ఆర్ఆర్ సినిమా హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్ల నుంచి తీవ్రస్థాయిలో పోటీ నెలకొంది.

అయితే ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్లు 348 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల హక్కులే 240 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు ప్రచారం జరుగుతోంది.ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు 70 కోట్ల రూపాయలకు విక్రయించినట్లు సమాచారం.

ఆర్ఆర్ఆర్ హిందీ హక్కులు 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తానికి అమ్ముడయ్యే అవకాశం ఉంది.

Telugu Pre, Rrr, India-Movie

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు ముందే 600 కోట్ల రూపాయలు థియేట్రికల్ హక్కుల ద్వారా వచ్చే అవకాశం ఉండటంతో ఆర్ఆర్ఆర్ నిర్మాతకు బడ్జెట్ కు సమానంగా లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.ఇప్పటికే విడుదలైన చరణ్, ఎన్టీఆర్ పాత్రలకు సంబంధించిన టీజర్లకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్, తారక్ కు జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube