శివుడు ఖండించిన వినాయకుడి తల కనిపించే ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసా..?

ముక్కోటి దేవతలలో మొదటి పూజ్యుడిగా భావించే దేవుడు వినాయకుడు అని చెబుతారు.అయితే పురాణాల ప్రకారం పార్వతీదేవి వినాయకుని పసుపు ముద్దతో తయారు చేసి ప్రాణం పోస్తుంది.

 Do You Know Where The Head Of Lord Ganesha Who Was Condemned By Lord Hiva Is Fo-TeluguStop.com

కైలాసం బయట పార్వతి దేవి లోపలకు ఎవరిని రానీయకుండా వినాయకుడిని కాపలా ఉంచుతుంది.అయితే కైలాసానికి వచ్చిన శివునికి లోపలికి వెళ్ళడానికి వినాయకుడు అనుమతించకపోవడంతో దీంతో ఆగ్రహానికి గురైన శివుడు వినాయకుడి తలను ఖండిస్తాడు.

తరువాత అక్కడున్నది తన పుత్రుడే అని తెలుసుకున్న శివుడు ఎలాగైనా వినాయకుడికి ప్రాణం పోయాలని భావిస్తాడు.ఈ నేపథ్యంలోనే శివుడు తనతోపాటు తెచ్చిన గజ ముఖాన్ని వినాయకుడికి పెట్టడం వల్ల వినాయకుని గజముఖుడు అని కూడా పిలుస్తారు.

అయితే ఆ పరమశివుడు ఖండించిన తల ఇప్పటికీ ఆ ప్రదేశంలో మనకు దర్శనమిస్తుంది.అంతేకాకుండా ఆ తలకు కాపలాగా సాక్షాత్తు ఆ పరమశివుడు ఉండడం విశేషం.

ఇంతకీ ఆ ప్రదేశం ఎక్కడ ఉందో ఇక్కడ తెలుసుకుందాము.

ఉత్త‌రాఖండ్‌లోని పితోరాగ‌డ్ ప్రాంతం గంగోలిహ‌ట్ నుంచి సుమారుగా 14 కిలోమీట‌ర్ల దూరంలో భువ‌నేశ్వ‌ర్ అనే గ్రామం ఉంటుంది.అక్క‌డే పాతాళ భువనేశ్వ‌ర స్వామి ఆల‌యం ఉంది.ఈ ఆలయంలోకి వెళ్లాలంటే సుమారు వంద కిలోమీటర్ల పాతాళం లోపల ఉన్న గుహలోకి వెళ్లాల్సి ఉంటుంది.

ఆ గుహ లోపల సాక్షాత్తు ఆ పరమ శివుడు ఖండించిన వినాయకుడి తలతో పాటు, ఆ పరమ శివుడు మనకు దర్శనమిస్తారు.అయితే ఈ గుహలోకి వెళ్లాలంటే చాలా మంది భక్తులు ఎంతో భయానికి మధ్యలోనే వెనక్కి తిరిగి వస్తారు.

అయితే ఈ పాతాళ భువనేశ్వర్ స్వామి ఆలయంలో స్వామివారు ఖండించిన వినాయకుడి తల విగ్రహ రూపంలో దర్శనమిస్తుంది.ఈ ఆలయం ఉన్న గుహలో అనేక గుహలతో అనుసంధానమై ఉన్నాయని ఈ గుహల గుండా వెళితే కైలాసం చేరుకోవచ్చని పురాణాలు చెబుతున్నాయి.

పరమశివుడు తన కుమారుడి తలకు కాపలా ఉండి ఈ గుహ గుండె కైలాసానికి వెళ్లారని పురాణకథ.అయితే ప్రస్తుతం ఈ గుహలో పర్యాటకులకు ఎవరికీ అనుమతి లేదు.

గుహ లోపల ఎంతో చీకటిగా ఉండటం వల్ల చాలా మంది ఊపిరాడక చనిపోతారన్న ఉద్దేశంతో ప్రస్తుతం ఎవరికీ అనుమతి కల్పించడం లేదు.

Do You Know Where The Head Of Lord Ganesha Who Was Condemned By Lord Hiva Is Foundlard Ganesh, Shiva, Condemns The Head, Goddess Parvati - Telugu Condemns, Goddess Parvati, Lard Ganesh, Shiva

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube