వైరల్ వీడియో: తండ్రి టాలెంట్ కు ముద్దుముద్దుగా నవ్వేస్తున్న బుడ్డది..!

సాధారణంగా చిన్న పిల్లలు దేవుడితో సమానం అని అందరూ అంటుంటారు.చిన్నపిల్లల నవ్వు ఎటువంటి వారినైనా ఇట్లే ఆకట్టుకుంటోంది.

 Viral Video The Buddha Who Smiles At His Fathers Talent,cute Girl, Father, Readi-TeluguStop.com

చిన్నపిల్లల నవ్వు చూస్తే ఎంతటి టెన్షన్స్ నైనా, వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్న అవన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటారు.ముఖ్యంగా తల్లిదండ్రులు అయితే వారి చిన్న పిల్లల నవ్వును చూసి మురిసిపోతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.

అలాగే పిల్లలు నవ్వించడానికి తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో విచిత్ర ఆలోచనలు చేస్తూ వారిని నవ్వించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.తాజాగా ఒక తండ్రి తన కూతురి కోసం వినుత్త రీతిలో ప్రయత్నించడంతో ఆ కూతురు ఎంత ఆనందంలో మునిగిపోయిందో చెప్పడానికి మాటలు చాలవు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.

ఇంతకు ఆ వీడియోలో ఏముందని అనుకుంటున్నారా…? ఒక తండ్రి తన కూతురు ఒడిలో కూర్చోబెట్టుకొని మిక్కీమౌస్ పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టాడు.ఆ పుస్తకాన్ని ఆ చిన్నారికి చూపిస్తూ ఒక్కో క్యారెక్టర్ కు ఒక్క వాయిస్ తో ఆ తండ్రి తన కూతురుకి చదివి వినిపించాడు.ఇలా ఒక్కొక్క బొమ్మకు ఒక డిఫరెంట్ వాయిస్ తో చదివినప్పుడల్లా ఆ చిన్నారి ఫుల్ జోష్ తో ఆనందంలో మునిగి పోయింది.

తన తండ్రి టాలెంట్ కు ఆ కూతురు ఫిదా అయిపోయి ఎంతో ఆనందంగా ఆ చిన్నారి మురిసిపోయింది.ఈ వీడియో సోషల్ మీడియా ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ “తన తండ్రి విభిన్న గొంతులతో బుక్ చదువుతుండడంతో ఈ చిన్నారి స్పందిస్తోంది.

నాకు ఈ రోజులు కావాల్సిందే “అనే కాప్షన్ ను జత చేశాడు తండ్రి.ఆ తండ్రి కూతుర్ల అనుబంధంని చూసి నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు.

ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎప్పటికీ గుర్తుంటాయి అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటే , క్యూట్ అండ్ బ్యూటిఫుల్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ క్యూట్ అండ్ లవ్లీ వీడియోను చూసి ఎంజాయ్ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube