అఖిల్ తో పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మోనాల్..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 4 లో లవ్ ట్రాక్ ద్వారా పాపులారిటీని పొందిన జంటల్లో మోనాల్ అఖిల్ జంట కూడా ఒకటి.మోనాల్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సమయంలో అఖిల్ బాధ పడ్డారు.

 Monal Sensational Comments About Marriage With Akhil,bigg Boss 4,monal,akhil,abo-TeluguStop.com

బిగ్ బాస్ హౌస్ నుంచి మోనాల్ 14వ వారం ఎలిమినేట్ కాగా అఖిల్ సార్థక్ బిగ్ బాస్ సీజన్ 4 రన్నరప్ గా నిలిచారు.బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత మోనాల్, అఖిల్ వేర్వేరుగా సినిమా ఛాన్స్ లతో బిజీ అవుతున్నారు.

Telugu Akhil, Monal, Monal Mother, Youtubechannel-Movie

అయితే మోనాల్, అఖిల్, సోహెల్ అప్పుడప్పుడూ కలుస్తూ పార్టీలు చేసుకుంటున్నారు.అయితే అఖిల్ మోనాల్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి.మోనాల్ కు సైతం ఇంటర్వ్యూల్లో అఖిల్ తో పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి.అయితే అఖిల్ తో పెళ్లి గురించి తాజాగా స్పందించిన మోనాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్య్వూలో మోనాల్ మాట్లాడుతూ అఖిల్ తో పెళ్లిని మీరు డిసైడ్ చేస్తారా ? మా మమ్మీ కదా పెళ్లి గురించి డిసైడ్ చేయాల్సింది ? మీరు ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు ? అంటూ ఘాటుగా స్పందించారు.మోనాల్ స్పందనతో అవాక్కవడం యాంకర్ వంతయింది.

అయితే అఖిల్ మోనాల్ మధ్య ఉన్నది స్నేహ బంధమో లేక ప్రేమ బంధమో తెలియాలంటే మాత్రం కొన్ని నెలలు ఆగాల్సిందే.

అఖిల్ గోపీచంద్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో పాత్రకు ఎంపికైనట్లు వార్తలు వస్తుండగా ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మరోవైపు మోనాల్ మాత్రం ఒకవైపు స్పెషల్ సాంగ్స్ చేస్తూనే మరోవైపు మాటీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే డ్యాన్సీ ప్లస్ అనే డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube