ఈ మధ్యకాలంలో సౌత్ నుంచి పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా తెరకెక్కుతున్నాయి.ఈ నేపధ్యంలో రెండు బాషలలో స్టార్ హీరోలుగా ఉన్నవారు కలిసి నటించే అవకాశాలు వస్తున్నాయి.
ఇప్పటికే తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి తెలుగులో కూడా నటిస్తున్నాడు.అలాగే ఇతర స్టార్ హీరోల సినిమాలలో నెగిటి రోల్స్ చేయడానికి రెడీ అవుతున్నాడు.
తాజాగా స్టార్ హీరో విజయ్ మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి పోషించిన నెగిటివ్ రోల్ ఎక్కువ ప్రశంసలు దక్కించుకుంది.అలాగే హీరో విశాల్, ఆర్యలు కూడా విలనీ రోల్స్ చేయడానికి ఆసక్తిగానే ఉన్నారు.
అలాగే మల్టీ స్టారర్ కథలు కూడా సిద్ధం అవుతున్నాయి.ఈ నేపధ్యంలో కాంబినేషన్ సినిమాలకి దర్శకులు కూడా మంచి కథలు సిద్ధం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే కోలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోలు కలిసి మల్టీ స్టారర్ చేస్తే చూడాలని చాలా మంది భావిస్తున్నారు.గతంలో మురుగదాస్ దళపతి విజయ్, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో సినిమా చేయాలని అనుకున్నారు.
అయితే అది సెట్ కాలేదు.అయితే స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ తాజాగా సోషల్ మీడియాలో ఫాన్స్ తో ముచ్చటిస్తూ సినిమాల గురించి విషయాలుపంచుకున్నాడు.అదే సమయంలో తన అభిమాన హీరోల గురించి ఇన్స్టాగ్రామ్ లో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు.దళపతి విజయ్ అల్లు అర్జున్ కలిసి ఒకేసారి ఒకే తెరమీద డాన్స్ చేస్తే ఆ పెర్ఫార్మన్స్ ఓ రేంజిలో ఉంటుంది.
వారి డాన్స్ కి కొలమానం కూడా వేయలేము అంటూ పోస్ట్ చేసాడు.అయితే అది జరుగుతుందో లేదో తెలియదు కానీ అశ్విన్ ఆలోచన మాత్రం అద్భుతంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు, మరో వైపు ఈ కాంబినేషన్ తెరకెక్కితే చూడాలని ఆయా హీరోల అభిమానులు కూడా కోరుకుంటున్నారు.