వామ్మో..అక్కడ వందల సంఖ్యలో సాలీడులు.. చివరికి?

సాధారణంగా మన ఇంట్లో సాలెపురుగులు అప్పుడప్పుడు దర్శనమిస్తుంటాయి.అయితే ఒక సాలెపురుగుని చూస్తేనే కొంతమంది గట్టిగా కేకలు వేస్తూ ఆమడ దూరం పరుగెడుతారు.

 Sydney Woman Finds Hundreds Of Spiders In Her Daughters Room, Australia, Daughte-TeluguStop.com

అదేవిధంగా ఒక్క సాలెపురుగులను చూడగానే వళ్ళు జలదరిస్తుంది.అలాంటిది కొన్ని పదుల సంఖ్యలో,వందల సంఖ్యలో సాలెపురుగులు దర్శనమిస్తే ఎలా ఉంటుంది? అచ్చం స్పైడర్ మాన్ సినిమాను తలపించే విధంగా ఉంటాయి.అచ్చం అలాంటి సంఘటన తాజాగా ఆస్ట్రేలియాలోని సిడ్నీలో చోటు చేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళితే…

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నగరంలో నివసిస్తున్నటటువంటి పిటీ.ఆర్‌ అనే మహిళ తన కూతురు బెడ్‌రూమ్‌ను శుభ్రం చేద్దామని ఆమె గదికి వెళ్ళింది.అయితే ఆ మహిళ తలుపు తీయగానే తన కూతురి గదిలో ఎవరూ ఊహించని విధంగా వందల సంఖ్యలో సాలెపురుగులు దర్శనమిచ్చాయి.

అన్ని సాలె పురుగులను చూడగానే మొదట భయపడిన ఆ మహిళ తరువాత ఎంతో ఆశ్చర్యానికి గురయింది.సదరు మహిళ తన స్నేహితురాలిని పిలిచి తన కూతురు గదిలో ఉన్న సాలెపురుగులను చూపించింది.

Telugu Australia, Bed, Spider, Sydney-Latest News - Telugu

అసలు పదుల సంఖ్యలో సాలెపురుగులు ఇంటిలోకి ఎలా వచ్చాయి అని అర్థం కాక ఆ మహిళలు వాటిని గది నుంచి బయటకు వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు.అయితే ఆ మహిళలు ఎంత ప్రయత్నించినా సాలెపురుగులు ఎంతసేపటికి కదలక పోవడంతో ఆ సాలె పురుగులను వీడియో తీసి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇన్ని సాలెపురుగులను బయట ఎక్కడా చూడలేదు.ఈ వీడియో చూస్తే ఎవరికైనా స్పైడర్ మాన్ సినిమా గుర్తు రావడం గ్యారెంటీ అంటూ, ఈ వీడియో అచ్చం స్పైడర్ సినిమాను మించి ఉంది అంటూ.

ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం ఈ సాలెపురుగులకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube