సాధారణంగా “షూటింగ్ అంటే భయం వేస్తుంది… షూటింగ్ నుంచి పారిపోవాలనిపిస్తుంది”.అనే మాటలు చిన్న ఆర్టిస్టుల అంటే అర్థం ఉంటుంది.
కానీ ఈ మాటలు స్టార్ హీరోలు అంటే ఎలా ఉంటుంది? ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా? బాలీవుడ్ అగ్రనటుడు బిగ్ బీ అమితాబచ్చన్ స్వయంగా ఈ మాటలు అంటే మిగతావారి పరిస్థితి ఏమిటి? ఈ మాటలు విన్న కొందరు బిగ్ బీ నుంచి ఇలాంటి మాటలు రావడం ఏంటి? అని ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు.అసలు బిగ్ బీ ఇలాంటి మాటలు ఎందుకు అన్నారంటే… కొత్త సినిమా షూటింగ్ కి వెళ్తూ బిగ్ బీ పడిన టెన్షన్ ను ఈ విధంగా ఆడియన్స్ తో తన ఫీలింగ్స్ ను షేర్ చేసుకున్నారు.
అమితాబచ్చన్ తాజాగా అజయ్ దేవగన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “మేడే” షూటింగ్ లో పాల్గొనడానికి వెళ్తున్న ఫోటోలను అభిమానులతో పంచుకున్న అమితాబచ్చన్ ఈ విధంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.”కొత్త సినిమా ప్రారంభమైన ప్రతి సారి అది ఒక పీడకల ఉంటుంది.తెలియని అలజడి, భయం సినిమా రిజల్ట్ ఏ విధంగా ఉంటుందనే టెన్షన్” మొదటిసారిగా కెమెరా ముందు నిలబడిన వ్యక్తి లాగా మాట్లాడటం ఎంతో ఆశ్చర్యం కలిగించింది.
మేడే ఈ చిత్రంలో కీ రోల్ పోషిస్తున్న నటి రకుల్ ప్రీత్ సింగ్ బిగ్ బీ చేసిన పోస్టుపై రియాక్ట్ అవుతూ.”ఇలాంటి మాటలు మేము చెప్పాలి.మీ లాంటి పెద్ద నటులతో కలిసిపని చేయడానికి ఎంతో భయంగా, నెర్వస్ గా ఉంటుందనీ” అంటూ రకుల్ ట్వీట్ చేశారు.
బిగ్ బీ పోస్ట్ పై సీనియర్ హీరో మాధవన్ స్పందిస్తూ…”మీరే ఇలాగంటే … మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్”అంటూ రిప్లై ఇచ్చారు.సాధారణంగా ఇండస్ట్రీలో మంచి పేరున్న హీరోలు వీలైనప్పుడు షూటింగుల్లో పాల్గొనడం గురించి మనం వినే ఉంటాం.
కానీ, బాలీవుడ్ ఇండస్ట్రీనీ శాసించే స్థాయిలో ఉన్న అమితాబచ్చన్ కొత్త సినిమా పట్ల చూపిస్తున్న అటెన్షన్ చూసి అభిమానులు ఎంతో గర్వపడుతున్నారు.ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.