గ్రామ సర్పంచ్ గా పోటీ చేయాలంటే ఏ అర్హతలు ఉండాలంటే..?!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.అయితే పలు గ్రామాల నుంచి ఎందరో అభ్యర్థులు సర్పంచ్ పదవిని దక్కించుకోవడానికి తాపత్రయ పడుతున్నారు.

 What Are The Qualifications To Compete As A Village Sarpanch, Panchyat Elections-TeluguStop.com

శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమయింది.ఐతే సర్పంచ్ గా నిలబడేందుకు ఎటువంటి అర్హతలు కావాలో తెలియజేసేందుకు ఎన్నికల సంఘం ఒక లిస్టు ని విడుదల చేసింది.

అలాగే ఎటువంటి వ్యక్తులు సర్పంచ్ పోటీలకు అనర్హులో కూడా ఎన్నికల సంఘం తెలియజేసింది.ఆ అర్హతలు ఏంటో, పోటీ కి అనర్హులు ఎవరో ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.

అర్హతలు:

1.సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలి అనుకునే వ్యక్తి కచ్చితంగా గ్రామపంచాయతీలో స్థానికుడై ఉండాలి.

2.ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వారి పేరు పంచాయతీ ఓటింగ్ లిస్టులో నమోదై ఉండాలి.

3.సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేసే సమయానికి పోటీ చేయాలి అనుకునే వ్యక్తి వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలి.

4.ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ అభ్యర్థులు జనరల్ కేటగిరి నుంచి కూడా పోటీ చేయడానికి ఆస్కారం ఉంది.

5.మహిళలకు రిజర్వు చేసిన స్థానాలతో పాటు అదే కేటగిరిలోని జనరల్‌ స్థానాల్లోనూ పోటీ చేయవచ్చు.

అనర్హులు ఎవరంటే:

1.గ్రామ సేవకులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులు సర్పంచ్ పోటీకి అనర్హులు.

2.చట్టం ద్వారా ఏర్పడిన ఏదైనా సంస్థకు చెందిన ఉద్యోగులు పోటీకి అనర్హులు.

3.నేరానికి పాల్పడి శిక్ష పడిన వారు పోటీకి అనర్హులు.

నేర శిక్షను అనుభవించిన తర్వాత ఐదు సంవత్సరాలు పూర్తి కాని వారు కూడా అనర్హులు.

Telugu Andhra Pradesh, Eligibility, Panchyat-Latest News - Telugu

4.మతిస్థిమితం లేని వారు.బదిరులు, మూగవారు అనర్హులు.

5.పౌరహక్కుల పరిరక్షణచట్టం–1955 పరిధిలోకి వచ్చే కేసుల్లో శిక్ష పడినవారు .

6.దివాళాదారుగా న్యాయ నిర్ణయం కోసం దరఖాస్తు చేసుకున్న వారు.రుణ విమోచన పొందని దివాళాదారు కూడా పోటీకి అనర్హుడు.

7.గ్రామ పంచాయతీ కి వ్యక్తిగతంగా బకాయిపడిన వారు.బకాయిల చెల్లింపులకు నోటీసులు ఇచ్చినా చెల్లించిన వారు పోటీకి అనర్హులు.

8.ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వారు కూడా దీనికి అనర్హులే.

9.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసే ఉద్యోగుల తో పాటు స్థానిక సంస్థల కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు ఏదైనా అవినీతికి కానీ విశ్వాస ఘాతుకానికి గానీ పాల్పడి ఉద్యోగం నుంచి తొలగించబడితే ఆ రోజు నుంచి ఐదేళ్లు పూర్తయ్యేంతవరకు సర్పంచ్ పోటీకి అనర్హులు.

10.గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏదైనా పనికి కాంట్రాక్టు చేసుకున్నా లేదా నిర్వహణకు ఒప్పందం చేసుకున్నా వారు కూడా పోటీకి అనర్హులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube