కెవి గుహన్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ మూడో సినిమా

సినిమాటోగ్రాఫర్ గా సౌత్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి కెవి గుహన్.ఈ టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ దర్శకుడుగా మారి మొదటి సినిమాని కళ్యాణ్ రామ్ తో తెరకెక్కించాడు.118 టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా థ్రిల్లర్ కాన్సెప్ తో పర్వాలేదని టాక్ తెచ్చుకుంది.ప్రస్తుతం అరుణ్ ఆదిత్, శివాని రాజశేఖర్ కాంబినేషన్ లో సోషల్ మీడియా బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో సైబర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో డబ్యూడబ్యూడబ్యూ టైటిల్ లో సినిమా తెరకెక్కించాడు.

 Anand Devarakonda Next Movie With Kv Guhan, Tollywood, Vijay Devarakonda, Suresh-TeluguStop.com

ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయ్యి ఆకట్టుకుంది.ఇక త్వరలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇదిలా ఉంటే గుహన్ ఇప్పుడు తన మూడో సినిమాని సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో చేయబోతున్నాడు.అయితే సురేష్ ప్రొడక్షన్ అయినా కూడా ఇది భారీ బడ్జెట్ మూవీ ఏమీ కాదు.

యంగ్ టాలెంటెడ్ హీరో, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో గుహన్ నెక్స్ట్ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. సురేష్ ప్రొడక్షన్ లోనే దొరసాని సినిమాతో దర్శకుడుగా పరిచయం అయినా ఆనంద్ తాజాగా మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి ఓటీటీ ద్వారా వచ్చాడు.

ఈ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.యంగ్ దర్శకుడు ఈ సినిమాలో మిడిల్ క్లాస్ ఎమోషన్స్, లవ్ స్టోరీని అద్భుతంగా చూపించాడనే టాక్ వచ్చింది.

ఈ నేపధ్యంలో ఆనంద్ దేవరకొండ ఈ సారి రెగ్యులర్ కథాంశంతో కాకుండా కొత్తదనం ఉన్న కథతో మూడో సినిమా ప్లాన్ చేసుకున్నాడు.కెవి గుహన్ చెప్పిన కథ బాగా నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశాడు.

ఏ సినిమా షూటింగ్ ని సురేష్ ప్రొడక్షన్ త్వరలో స్టార్ట్ చేయడానికి రెడీ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube