ఏపీలో పంచాయితీ ఎన్నికల పోరు హాట్ హాట్‌గా సాగేలా ఉంది.అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య హోరాహోరీగా పంచాయితీల వార్ జరగనుంది.
ఇప్పటికే రెండు పార్టీలు పంచాయితీ ఎన్నికలకు సిద్ధమైపోయాయి.అటు బీజేపీ-జనసేనలు సైతం పంచాయితీల్లో పట్టు నిలుపుకోవాలని చూస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఓట్లని కొల్లగొట్టడానికి రాజకీయ పార్టీలు వ్యూహ-ప్రతివ్యూహాలతో ముందుకెళుతున్నాయి.
సామాజికవర్గాల పరంగా పార్టీలు ఓట్లు దక్కించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి.
అయితే కీలకమైన కృష్ణా జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో కాపు సామాజికవర్గం హవా ఎక్కువగా ఉంటుంది.ముఖ్యంగా మచిలీపట్నం, పెడన, గుడివాడ, అవనిగడ్డ, కైకలూరు నియోజకవర్గాల్లో కాపు ఓటర్ల మీద గెలుపోటములు ఆధారపడి ఉంటాయి.2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో కాపులు టీడీపీకి అనుకూలంగా ఉన్నారు.అందుకే అప్పుడు టీడీపీ ఎక్కువ స్థానాల్లో గెలిచింది.
అయితే 2019 ఎన్నికలకు వచ్చేసరికి జగన్‌కు అనుకూలంగా మారింది.దీంతో అన్నీ స్థానాల్లో ఫ్యాన్ హవా స్పష్టంగా కనిపించింది.ఇక ఇప్పుడు పంచాయితీ ఎన్నికల్లో ఈ కాపు ఓటర్లు ఎటువైపు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది.2019 ఎన్నికల్లో ఉన్న జగన్ వేవ్ ఇప్పుడు పెద్దగా లేదు.అలా అని టీడీపీ పెద్దగా పుంజుకోలేదు.బీజేపీ-జనసేనలకు అంత సీన్ లేదు.కాస్త అటు ఇటూగా చూస్తే ఈ నియోజవర్గాల్లో మెజారిటీ కాపు ఓటర్లు జగన్ వైపే ఉండేలా కనిపిస్తున్నారు.
అలా అని టీడీపీకి తక్కువ మద్ధతు ఏమి లేదు.
కొన్నిచోట్ల టీడీపీకి కాపులు వీరాభిమానులుగా ఉన్నారు.ఇక యువ కాపు ఓటర్లు జనసేన వైపు ఉందే ఛాన్స్ ఉంది.
మొత్తానికి చూసుకున్నట్లైతే ఈ కాపు ఓటర్ల ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో జగన్‌కు గట్టి సపోర్ట్ ఉందనే చెప్పొచ్చు.మరి ఎన్నికల సమయంలో కాపులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.