గొడ్డలి పట్టుకుని రిలీజ్ డేట్ చెప్పిన పుష్ప

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘పుష్ప’ నుండి తాజాగా మరో అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేస్తున్నట్లు ప్రకటించింది.దీంతో ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Pushpa Movie Release Date Announced, Pushpa, Allu Arjun, Sukumar, Rashmika Manda-TeluguStop.com

కాగా ఈ సినిమా టీజర్ రిలీజ్‌ను గురించి ఏదైనా అప్‌డేట్ ఉంటుందేమో అని అందరూ అనుకున్నారు.కానీ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసి అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

పుష్ప చిత్రాన్ని ఆగష్టు 13న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.ఈ పోస్టర్‌లో అల్లు అర్జున్ చేతిలో ఓ గొడ్డలి పట్టుకుని ఒక గుంపు మధ్యలో కూర్చున్నాడు.ఈ సినిమాను పూర్తిగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే తెలిపిన సంగతి తెలిసిందే.

అయితే ఈ పోస్టర్ చూస్తే ఈ సినిమా ఏ రేంజ్‌లో మాస్ అంశాలు ఉండబోతున్నాయో మనకు ఇట్టే అర్థమవుతుంది.ఇక ఈ సినిమాలో పుష్పక్‌రాజ్ అనే పాత్రలో ఊరమాస్ లుక్‌లో మనకు కనిపిస్తున్నాడు.

సుకుమార్ ఈ సినిమాను పూర్తి రివెంజ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు.కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.ఇక ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆమె పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి కూడా అందరిలో నెలకొంది.

ఇక పాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.ఏదేమైనా పుష్ప సినిమాను ఆగస్టు 13న రిలీజ్ చేస్తుండటంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube