బాలీవుడ్ నటిపై ట్రోలింగ్.. హాట్ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్.. ?

హీరోయిన్స్ అనగానే అందం, అభినయం, ఆకట్టుకునే శరీర సౌష్టవం.వీటిలో ఏది తగ్గినా ప్రేక్షకులు ఆదరించడం కొంచెం కష్టమే.

 Bolly Wood Actress, Malaika Arora, Trolling, Netizens-TeluguStop.com

ఇక నటీమణులు పెళ్లి గనుక చేసుకుంటే వారి ఆకారంలో కాస్త మార్పు కనిపించడం, ఆ తర్వాత వ్యాయమాలు చేసి తమ అందాన్ని తెచ్చుకునే ప్రయత్నాలు చేయడం కామనే.ఈ విషయంలో సాధారణ మహిళల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు ఎవరూ అతీతులు కాదు.

ఆడవారికి ప్రసవం తర్వాత పొట్ట మీద మచ్చలు, చారలు ఏర్పడటం సహజం.అయితే ఈ విషయం లో బాలీవుడ్‌ నటి మలైకా అరోరాను ట్రోల్ చేస్తున్నారట కొందరు నెటిజన్స్.

తాజాగా బాలీవుడ్‌ నటి మలైకా అరోరా వ్యాయామం చేసి బయటకు వచ్చిన సమయంలో ఆ ఫొటోలను క్లిక్‌మనిపించిన కొందరు, ఆమె పొట్ట మీద ఉన్న స్ట్రెచ్ మార్కులను చూసి నానా రకాలుగా కామెంట్లు చేస్తున్నారట.

మరి కొందరైతే మలైకా ముసలిదైపోయిందంటూ విమర్శలు గుప్పిస్తున్నారట.

హాలీవుడ్ నటి జెన్నిఫర్‌ లోపెజ్‌ తో పోలుస్తూ కించపరుస్తున్నారట.అయితే ఇలా ఆమెను కావాలని టార్గెట్‌ చేస్తున్నారని, నిజానికి 40 ఏళ్ల వయసులో ఆమె ఎంతో అందంగా ఉందని, మీరైతే 20, 30 ఏళ్లకే ముడతలు పడ్డ వెల్లుల్లిలా కనిపిస్తారని ఆ ట్రోలింగ్‌ను కొందరు నెటిజన్స్ తిప్పికొట్టారట.

ఇక ఇద్దరు పిల్లల తల్లైన మలైకా ఇప్పటికీ ఇంత ఫిట్‌గా కనిపించడం గ్రేట్ అంటున్నారట కొందరైతే.అయినా ఎవరి లైఫ్ వారిది.

వారెలా ఉంటే ఏంటని అనుకోకుండా ఇలా కామెంట్స్ చేసేవారిని ఏమంటారో మీరే ఊహించుకోండి అంటున్నారట కొందరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube