న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఆశా వర్కర్ కుటుంబానికి 50 లక్షలు

కరోనా వాక్సిన్ తీసుకుని బ్రెయిన్ డెడ్ అయ్యి మరణించిన గుంటూరు జిల్లాకు చెందిన ఆశా వర్కర్ బొక్క నాగలక్ష్మి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం 50 లక్షల నష్టపరిహారం ప్రకటించింది.

 Telugu Ap And Telangana Breaking News, Gold Rates, Headlines,  News Roundup, Re-TeluguStop.com

2.మార్కెట్లోకి విజయ డైరీ ఐస్ క్రీమ్

తెలంగాణ విజయ డైరీ కొత్తగా ‘ విజయ ఐస్ క్రీమ్ ‘ ను మార్కెట్లోకి ఈ రోజు విడుదల చేస్తోంది.

3.పీవీ విజ్ఞాన్ వేదిక డిజైన్ ఆవిష్కరణ

Telugu Colonelsantosh, Gold Rates, Pm Kisan, Republic Day, Teluguap-Latest News

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విజ్ఞాన వేదిక డిజైన్ ను తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన కార్యాలయంలో అవిష్కరించారు.

4.తెలంగాణ కు జీఎస్టీ పరిహారం విడుదల

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిహారం కింద 129 కోట్లు విడుదల చేసింది.

5.రసమయిని సీఎం చేయాలి

తెలంగాణకు దళితుడిని సీఎం చేస్తాను అని చెప్పిన కేసీఆర్ ఇప్పటికైనా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను సీఎం చేసి ఆ  మాట నిలబెట్టుకోవాలి అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

6.406 వ రోజుకి రైతుల దీక్షలు

అమరావతిలోని రాజధాని ని కొనసాగించాలంటూ కొనసాగించాలంటూ కోరుతూ అమరావతి పరిసర ప్రాంత రైతులు చేపట్టిన దీక్ష నేటికి 406 వ రోజుకి చేరింది.

7.తిరుపతి బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా రత్న ప్రభ

Telugu Colonelsantosh, Gold Rates, Pm Kisan, Republic Day, Teluguap-Latest News

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలలో జనసేన బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ రత్నప్రభ ను ఎంపిక చేసే అవకాశమున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

8.పంచాయతీ ఎన్నికలకు కేంద్ర సిబ్బంది

ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అవసరమైతే కేంద్ర సిబ్బందిని వినియోగించుకుంటామని ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు.

9.ఆళ్లగడ్డ కు చేరుకున్న అఖిల ప్రియ

Telugu Colonelsantosh, Gold Rates, Pm Kisan, Republic Day, Teluguap-Latest News

టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ సోమవారం మధ్యాహ్నం ఆళ్లగడ్డ కు చేరుకున్నారు.

10.పీఎం కిసాన్ 10 వేలకు పెంపు

ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన కింద ప్రభుత్వం అందిస్తున్న 6 వేల ఆర్థిక సహాయాన్ని 10 వేలకు పెంచారు.

11.ఢిల్లీలో రైతులపై బాష్పవాయు గోళాల ప్రయోగం

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా ఉద్రిక్తత ఏర్పడడంతో ట్రాక్టర్ల ర్యాలీ పై పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు.

12.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,102 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

13.ఒకటి నుంచి కృష్ణా జలాల నిలిపివేత

కండలేరు డ్యామ్ నుంచి విడుదలవుతున్న కృష్ణాజలాలను ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఏపీ అధికారులు నిలిపివేయనున్నారు.

14.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 189 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

15.1న రైతుల పార్లమెంట్ మార్చ్

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులు ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంట్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించారు.

16.27 న పీఆర్సీ చర్చలు

పిఆర్సి నివేదికపై త్రిసభ్య కమిటీ సమావేశం ఈనెల 27వ తేదీన జరగబోతోంది.

17.చైనా యాప్ లపై శాశ్వత నిషేధం

Telugu Colonelsantosh, Gold Rates, Pm Kisan, Republic Day, Teluguap-Latest News

టిక్ టాక్ తో సహా 59 చైనా యాప్ లపై శాశ్వత నిషేధం విధించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.

18.పాత కరెన్సీ నోట్ల పై ఆర్బిఐ స్పందన

మార్చి నెల నుంచి పాత సిరీస్ నోట్లు కొన్ని చెల్లుబాటు కావు అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ స్పందించింది.అవన్నీ వట్టి పుకార్లేనని ప్రకటించింది.

19.కల్నల్ సంతోష్ బాబు కి మహా వీర్ చక్ర

Telugu Colonelsantosh, Gold Rates, Pm Kisan, Republic Day, Teluguap-Latest News

తెలంగాణ చెందిన కల్నల్ సంతోష్ బాబు కు కేంద్ర ప్రభుత్వం మహావీర్ చక్ర పురస్కారం ప్రకటించింది.

20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,050

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 50,230

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube