సింగర్ సునీత పేరు వినగానే గుర్తొచ్చే పాట “ఈ వేళలో నీవు“.ఈ పాట వింటే చాలు.వినే కొద్దీ వినాలనిపిస్తుంది.అటువంటి పాటని పరిచయం చేసిన సింగర్ సునీత ఎన్నో పాటలు పాడి అందరిని ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే సింగర్ సునీత ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.తన పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.
ఇటీవలే తమ పెళ్లికి సంబంధించిన టీజర్ ను విడుదల చేసిన సునీత.
ప్రముఖ డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేని ను శంషాబాద్ పురాతన గుడి లో తమ కుటుంబ సభ్యుల సమక్షంలో అతికొద్ది ఏర్పాట్లతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది.
ఇటీవలే సింగర్ సునీత ఓ చానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో తన వ్యక్తిగత విషయాలు తెలిపింది.ఇదిలా ఉంటే తన వెడ్డింగ్ టీజర్ విడుదల చేయగా ప్రస్తుతం వైరల్ గా మారింది.
సునీత, రామ్ ల పెళ్లి వీడియో కు సంబంధించిన టీజర్ ను తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియో ను విడుదల చేసింది సునీత.ఆ వీడియోలో తన పెళ్లి సందర్భంగా ఇంట్లో చేస్తున్న పని నుండి పెళ్లి అయ్యేంత వరకు ఉండగా ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంది.ఆ వీడియోలో సునీత ఆనందానికి అంతు లేకుండా ఉంది.మన జీవితంలోకి అడుగుపెడుతున్న సంతోషంను తన కుటుంబం తో పంచుకుంది.
ఈ వీడియోలో తన పిల్లలతో ఆడుకున్న కొన్ని జ్ఞాపకాలను కూడా బంధించింది.అంతేకాకుండా డాన్సులతో అలరించారు.
ఇందులో ముఖ్యంగా యాంకర్ సుమ కనకాల ఉండగా తన డాన్స్ బాగా ఆకట్టుకుంది.సునీత, సుమ ల మధ్య పాతికేళ్ల స్నేహం ఉంది.
తనను పెళ్లి కూతురు చేస్తున్నప్పుడు సునీత కళ్ళల్లో చెప్పలేని ఆనందం కనిపిస్తుంది.కాగా ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవ్వగా.
త్వరలో పెళ్లికి సంబంధించిన వీడియో షేర్ చేయనుంది.