అల్లు వారిపై ఆగ్రహంతో ఉన్న క్రాక్‌ డిస్ట్రిబ్యూటర్స్‌

అల్లు అరవింద్ ఈమద్య కాలంలో వివాదాలకు దూరంగా పెద్ద సినిమాల విషయంలో తల దూర్చకుండా చిన్న సినిమాల విడుదల విషయంలో తనకు సంబంధం లేదు అన్నట్లుగా ఉంటున్నాడు.తాజాగా ఈయన దృష్టి మొత్తం కూడా ఆహా మీదే ఉంది.

 Raviteja Krack Movie Going To Streaming In Aha Ott , Aha, Ott Platform, Raviteja-TeluguStop.com

ఓటీటీ గా ఆహాను ఓ రేంజ్ లో ఉంచాలనేది అల్లు వారి అభిప్రాయం.అందుకే ఆహా కంటెంట్ కోసం రోజుకు 12 గంటలకు పైగా చర్చల్లో పాల్గొంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

కొత్త సినిమాలు మరియు వెబ్‌ సిరీస్‌ లతో పాటు భారీ ఎత్తున కంటెంట్‌ ను క్రియేట్‌ చేసేందుకు భారీగా ఖర్చు చేస్తున్నాడు.ప్రస్తుతం ఈ విషయంలో అల్లు వారిని చూసి అంతా ఆశ్చర్య పోతున్నారు.

ఇప్పటి వరకు ఒరిజినల్‌ కంటెంట్‌ విషయమై దృష్టి పెట్టిన అల్లు అరవింద్‌ ఇప్పుడు పెద్ద సినిమా డిజిటల్‌ రైట్స్ ను దక్కించుకున్నాడు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్ట్రీమింగ్‌ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Telugu Allu Aravind, Krack Aha Ott, Krack, Ott Platm, Ott Telugu, Raviteja, Ravi

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్రాక్‌ మూవీని ఆహాలో ఈనెల 29న స్ట్రీమింగ్‌ చేయబోతున్నారట.ఈ విషయమై అధికారికంగా ప్రకటన చేయకుండా చిన్న లీక్ ఇచ్చారు.రవితేజ మరియు శృతి హాసన్‌ నటించిన ఈ సినిమాకు గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహించాడు.

రికార్డు బ్రేకింగ్‌ గా వసూళ్లు సాధిస్తు ముందుకు దూసుకు పోతుంది.ఇలాంటి సమయంలో ఆహాలో స్ట్రీమింగ్‌ చేయడం అంటే డిస్ట్రిబ్యూటర్లను ఇబ్బంది పెట్టడమే వారికి నష్టం కలిగించడం అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రస్తుతం సినిమా ప్రీమియర్‌ విషయమై విమర్శలు డిస్ట్రిబ్యూటర్లు అడ్డు చెబుతున్నారు.ఒక వైపు సినిమా థియేటర్లలో నడుస్తున్న సమయంలో మరో వైపు ఇలా ఓటీటీ కి ఇవ్వడం పెద్ద తప్పు.

కనీసం 40 రోజులు కాకుండా ఎలా స్ట్రీమింగ్‌ చేస్తారు అంటున్నారు.ఈ విషయమై బయ్యర్లు మరియు అల్లు అరవింద్‌ కు గొడవ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

సినిమా విడుదలకు సహకరించిన అల్లు అరవింద్‌ కోరికను నిర్మాత ఠాగూర్‌ మధు కాదనలేక పోతున్నాడు.దాంతో ఆహాలో క్రాక్‌ స్ట్రీమింగ్‌ అయ్యేది ఎప్పుడు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube