వైరల్: అలుపెరుగని ఒంటరి పర్యాటకురాలు..!

హర్యానాలోని చిన్న పల్లెటూరిలో పుట్టి పెరిగిన గరిమా బక్షి చదువు పూర్తవగానే చిన్నాచితకా ఉద్యోగాలు చేసింది.ఆ తర్వాత ఉద్యోగాలు మానేసి ప్రపంచం మొత్తం తిరుగుతూ తన సమయాన్ని గడుపుతోంది.

 Viral Untired Lone Tourist, Traveling, Talravrl, Haryana, Viral Post, Viral Late-TeluguStop.com

అయితే చిన్న వయసులో కూడా భయపడకుండా ఒంటరిగా దేశాలను చుట్టేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.కేవలం రెండు జతల బట్టలు బ్యాగ్ లో పెట్టుకొని ఒంటరిగానే ప్రపంచాన్ని చుట్టేస్తున్న ఈ అమ్మాయి మొన్నీ మధ్య ఉగాండా దేశానికి వెళ్ళింది.

ఈ నేపథ్యంలోనే గుంటూరు కి చెందిన ప్రముఖ తెలుగు ట్రావెలర్ ఉమా ప్రసాద్ ని కలిసింది.అతనితో ముచ్చటగా మాట్లాడుతూ వెంటనే ఫ్రెండ్ అయ్యింది.అయితే కేవలం ఉమా ప్రసాద్ తో మాత్రమే కాదు తాను వెళ్ళిన ప్రతిచోటా ఒక చిన్న చిరునవ్వు నవ్వుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ పరిచయాలు పెంచేసుకుంటూ భయం బెరుకు లేకుండా గరిమా అనేక ప్రజల సంస్కృతులను తెలుసుకుంటోంది.

Telugu Garima Bakshi, Haryana, Talravrl, Traveller, Uma Prasad, Latest-Latest Ne

గరిమా మొట్టమొదట గోవా కి వెళ్లి అక్కడ కొద్ది రోజుల పాటు ట్రావెలింగ్ చేసింది.తర్వాత ఒరిస్సాలోని గిరిజన ప్రాంతాలకు వెళ్లి అక్కడి ప్రజల సంస్కృతి సాంప్రదాయాలను అడిగి తెలుసుకుంది.అలాగే వారి జీవన శైలి గురించి వివరంగా తన యూట్యూబ్ వీడియోలలో వెల్లడించింది.ప్రస్తుతం చాలా దేశాలు వీసా ఇవ్వడం లేదు కాబట్టి ఆమె ఆఫ్రికా దేశాల్లో పర్యటిస్తోంది.

కెన్యా, నైరోభి, తంజానియా దేశాల్లో పర్యటించిన ఈమె ప్రస్తుతం తన పర్యటనను కొనసాగిస్తూనే ఉన్నారు.టాంజానియా దేశంలో ఆమె ఒక్కటే దాదాపు వెయ్యి కిలోమీటర్ల పాటు ప్రయాణించి ఆశ్చర్యపరిచారు.

ప్రపంచం అంతా చుట్టేసి ఎన్నో జ్ఞాపకాలను ఏర్పరుచుకోవాలని తాను ఇంటిని వదిలేసి బయటకు వచ్చానని చెబుతుంది.ఎంతైనా ఒంటరిగా నా ప్రపంచం చుట్టేస్తున్నయువతి ధైర్యానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube