వదల బొమ్మాలీ..ట్రంప్ ను వేటాడుతున్న పౌచీ..!!

అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా మరణాలు ప్రపంచంలో మరే దేశంలో కూడా జరగలేదని చెప్పాలి.సుమారు 4 లక్షలమందికి పైగా కరోనా బారినపడి మృతి చెందినట్టుగా నివేదికలు చెప్తున్నాయి.

 Dr. Anthony Fauci Shocking Comments On Trump , Donald Trump, Anthony Fauci, Trum-TeluguStop.com

అయితే ఈ మరణాలు అన్నిటికి ప్రధాన కారణం ట్రంప్ మాత్రమేనని గత అధ్యక్షుడు ట్రంప్ చేతకాని తనంవలనే లక్షల మంది అమెరికన్స్ ప్రాణాలు కోల్పోయారని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని పౌచీ మరో సారి ట్రంప్ పై విరుచుకుపడ్డారు.ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే కాదు, అధ్యక్ష పదవి నుంచీ కిందకు దిగిన తరువాత కూడా పౌచీ ట్రంప్ పై మాటల యుద్ధం చేస్తూనే ఉన్నారు.

ట్రంప్ ప్రభుత్వం నీతి , నిజాయితీగా లేకపోవడం వలనే ఇలాంటి దారుమైన పరిస్థితులు అమెరికాలో చోటు చేసుకున్నాయని మరో సారి ఆరోపించారు పౌచీ.గతంలో కంటే ఘాటుగానే స్పందించిన పౌచీ ఈ సారి ట్రంప్ పై నిప్పులు చెరిగారు.

కరోనా విజ్రుంభిస్తున్న సమయంలో కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కళ్ళప్పగించి చూసింది తప్ప నివారణ చర్యలు చేపట్టడంలో స్పందించలేదని ఆరోపించారు.మరణాలు సంభవిస్తున్న సమయంలో కూడా మాస్క్ లు పెట్టుకోవద్దని భాద్యతారాహిత్యంగా ట్రంప్ వ్యవహరించారని అన్నారు.

Telugu Anthony Fauci, Covid, Donald Trump, Dranthony, Trump-Telugu NRI

కరోన అమెరికాలోకి రాక ముందే అధికారులు, నిపుణులు వైరస్ పై జాగ్రత్తలు తీసుకోవాలని , చైనాలో పరిస్థితులు ట్రంప్ కి వివరించారని అయితే ఏ అధికారి మాటను ట్రంప్ పట్టించుకోలేదని ఆవేదన చెందారు పౌచీ.విషయజ్ఞానం లేనపుడు ఎవరైనా సరే నిపుణుల మాటలు వినాలని కానీ ట్రంప్ ఇవేమీ పట్టించుకోలేదని అన్నారు.పరిశోధకులను పిచ్చోళ్ళతో పోల్చారని ఇప్పుడు ట్రంప్ కారణంగా అమెరికా భారీ మూల్యం చెల్లించుకుంటోందని అన్నారు.బిడెన్ తీరు పూర్తిగా భిన్నమని, తాము ఏ విషయాలు చెప్పకుండానే ముందుగా నియంత్రణ చర్యలు చేపట్టారని, నిపుణులతో భేటీ అయ్యి కరోన కట్టడికి సూచనలు తీసుకుంటున్నారని అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube