తమిళ స్టార్ హీరోతో రొమాన్స్‌కు రెడీ అయిన నాని హీరోయిన్

నేచురల్ స్టార్ నాని నటించిన ‘గ్యాంగ్‌లీడర్’ చిత్రం గురించి అందరికీ తెలిసిందే.ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోగా, ఆ సినిమాలో నటించిన ప్రియాంక ఆరుల్ మోహన్ టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైంది.

 Priyanka Arul Mohan In Suriya Next Movie, Priyanka Arul Mohan, Nani, Gangleader,-TeluguStop.com

అయితే ఈ సినిమా తరువాత మరే ఇతర సినిమాలో నటించలేదు.దీంతో ఆమె కెరీర్ ఇలా వచ్చి అలా ముగిసిందని చాలా మంది అనుకున్నారు.

అయితే అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ అమ్మడు యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న శ్రీకారం చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది.

ఇక ఈ సినిమాను ప్రస్తుతం రిలీజ్‌కు రెడీ చేశారు చిత్ర యూనిట్.

ఈ సినిమాలోని పోస్టర్స్‌లో ప్రియాంక అందంగా కనిపిస్తుండటంతో ఈ సినిమాను త్వరగా చూసేయాలని ప్రేక్షకులు కోరుతున్నారు.ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే మరో అద్భుతమైన ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ.

తమిళ స్టార్ హీరో సూర్య నటించబోయే ఓ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక ఆరుల్ మోహన్‌ను సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది.తమిళ దర్శకుడు పాండిరాజ్ డైరెక్షన్‌లో సూర్య నటించబోయే సినిమాలో ప్రియాంకకు హీరోయిన్ ఛాన్స్ వచ్చినట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

ఏదేమైనా ఈ సినిమా ఛాన్స్ అమ్మడికి పెద్ద విషయమనే చెప్పాలి.ఇప్పటివరకు స్టార్ హీరోలతో చేసే ఛాన్స్ రాకపోవడంతో, సూర్య లాంటి వెర్సటైల్ యాక్టర్‌తో కలిసి చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఉందట ఈ బ్యూటీ.

మరి సూర్య సరసన ఎలాంటి పాత్రలో ఈ బ్యూటీ కనిపిస్తుందా అనే ఆసక్తి అప్పుడే తమిళ ప్రేక్షకుల్లో నెలకొంది.ఇక ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు రెడీ అవుతుండగా, వచ్చే నెలలో ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

కాగా సూర్య ఇటీవల ఆకాశమే నీ హద్దురా చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube