ఈ కూర‌గాయ‌ల పిండి తింటే.. ఎన్ని హెల్త్ బెనిఫిట్సో తెలుసా?

సాధార‌ణంగా పిండ్లు అంటే.బియ్యం పిండి, మైదా పిండి, శెన‌గ‌పిండి, రాగి పిండి, పెస‌ర పిండి, గోధుమ పిండి, మిన‌ప పిండి ఇలాంటివే చాలా మందికి తెలుసు.

 Health Benefits Of Vegetable Powders! Health, Benefits Of Vegetable Powders, Veg-TeluguStop.com

అయితే ప‌లు కూర‌గాయ‌ల‌తో కూడా పిండ్లు చేస్తుంటారు.కూర‌గాయ‌ల‌ను బాగా ఎండ‌బెట్టి.

ఆ త‌ర్వాత వాటితో పిండి త‌యారు చేస్తుంటారు.ఇలా చేసిన పిండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

మ‌రి ఏ ఏ కూర‌గాయ‌ల‌తో పిండ్లు చేస్తుంటారు.ఆ పిండ్లు వ‌ల్ల వ‌చ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటీ అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

క్యారెట్ పిండి.

Telugu Beet Root, Carrot, Tips, Latest, Vegetables-Telugu Health - తెలు�

సాధారణంగా క్యారెట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.అయితే చాలా మంది క్యారెట్‌ను డైరెక్ట్‌గా తిన‌లేరు.అలాంటి వారు క్యారెట్ల‌తో పిండి త‌యారు చేసుకుని.తీసుకుంటే ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం లాంటి మిన‌ర‌ల్స్‌తో పాటుగా కంటి చూపును మెరుగు ప‌రిచే విట‌మిన్ ఎ, రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే విట‌మిన్ సి, ఎముక‌ల‌ను దృఢ‌ప‌రిచే విట‌మిన్ కె ఇలా ఎన్నో పోష‌కాలు పొంద‌వ‌చ్చు.

బీట్ రూట్ పిండి.

Telugu Beet Root, Carrot, Tips, Latest, Vegetables-Telugu Health - తెలు�

ఇది కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది.చాలా మంది బీట్ రూట్ అంటేనే ముఖం చాటేస్తుంటారు.అయితే బీట్ రూట్‌తో పిండి త‌యారు చేసుకుని.దాన్ని తీసుకుంటే బోలెడు హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు.బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు బీట్ రూట్ పిండిని గోధుమ పిండితో క‌లిపి రొట్టెలు చేసుకుని తీసుకుంటే.అధిక బ‌రువుకు చెక్ పెట్ట‌వ‌చ్చు.

అలాగే బీట్ రూట్ పిండిని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త హీన‌త స‌మ‌స్యకు దూరంగా ఉండొచ్చు.చిన్న పిల్ల‌ల‌కు బీట్ రూట్ పిండిని పాల‌లో క‌లిపి పెట్ట‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌డంతో పాటు మెద‌డు చురుగ్గా ప‌ని చేస్తుంది.

బ్రకోలీ పిండి.

Telugu Beet Root, Carrot, Tips, Latest, Vegetables-Telugu Health - తెలు�

చూడటానికి కాలీఫ్లవర్‌లా కన్పించి బ్రకోలీని చాలా మంది తినేందుకు ఇష్ట‌ప‌డ‌త‌రు.గ్రీన్ వెజిటేబుల్స్ లో ఎక్కువ న్యూట్రీషియన్స్ కలిగినటువంటి వెజిటేబుల్ బ్ర‌కోలీనే.అలాంటి బ్ర‌కోలీని తిన‌లేని వారు.దానితో పిండి త‌యారు చేసుకుని.రోజువారి వంట‌ల్లో ఉప‌యోగించ‌వ‌చ్చు.ఇలా చేయ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎన్నో పోష‌కాలు అందుతాయి.జీర్ణ స‌మ‌స్య‌ల‌ను దూరం చేయ‌డంలోనూ, నిద్ర‌లేమిని త‌గ్గించ‌డంలోనూ, బ‌రువు త‌గ్గించ‌డంలోనూ, గుండె జ‌బ్బ‌లు ద‌రి చేర‌కుండా చేయడంలోనూ ఈ బ్ర‌కోలీ పిండి ఉప‌యోగ‌పుడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube