వాటర్ ట్యాంక్ లో అస్తిపంజరాలు.. ఎలా వచ్చాయంటే ?

వాటర్ ట్యాంకులో రెండు అస్తిపంజరాలు బయటపడడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది.అయితే ఆ పాడుబడిన వాటర్ ట్యాంకులో రెండు అస్తిపంజరాలు ఎలా వచ్చాయి అనేది అంతుచిక్కని విషయంగా మారింది.

 Skeletons In A Water Tank, Skeletons, Water Tank, Janagama, Police-TeluguStop.com

నర్మెట మండలకేంద్రం నుంచి జనగామ వెళ్లేదారిలో నిరుపయోగంగా ఉన్న ఓ వాటర్ ట్యాంక్ లో రెండు అస్తిపంజరాలు ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారాన్ని తెలియజేశారు.పోలీసుల తెలిపిన వివరాల మేరకు….

నర్మెట మండలకేంద్రం నుంచి జనగామ వెళ్లేదారిలో ఉపాధి హామీ పనుల క్రింద వ్యవసాయ క్షేత్రంలో నర్సరీ ఉండేది.కొన్ని సంవత్సరాల క్రితం ఈ నర్సరీ నిర్వహణ బాగా లేకపోవడం వల్ల ఆ నర్సరీ కోసం అక్కడ నియమించిన నీళ్ళ ట్యాంక్ ప్రస్తుతం వృధాగా ఉంది.

అయితే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కొందరు పిల్లలు గాలి పటాలను ఎగుర వేస్తూ ఆ ట్యాంక్ వైపు వెళ్లారు.ఆ ట్యాంక్ పరిసరప్రాంతాలలో దుర్వాసన రావడంతో పిల్లలు ఈ విషయాన్ని వెంటనే స్థానికులకు తెలియజేశారు.

ట్యాంక్ దగ్గరికి చేరుకున్న స్థానికులు ట్యాంక్ లోపల అస్థిపంజరాలు ఉండటంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Telugu Janagama, Tank-Telugu Crime News(క్రైమ్ వార్తలు

ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఈ సమాచారాన్ని వెంటనే పోలీసులకు చేరవేశారు.ఈ విషయం తెలుసుకున్న సీఐ రాపెల్లి సంతోష్‌కుమార్‌ వెళ్లి అస్థి పంజరాలను పరిశీలించారు.ఆస్తి పంజరాలను పరిశీలించిన సీఐ వాటర్ ట్యాంక్ ఎత్తులో ఉండటం వల్ల ఏవైనా కోతుల ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మరణించినట్లు ఉంటాయని ఆయన భావించారు.

అయితే స్థానికులు అస్తిపంజరాలను చూసి ఎవరో చిన్న పిల్లలను చంపి అందులో పడేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, అస్థి పంజరాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

పోస్ట్ మార్ట్ నివేదిక ఆధారంగా విచారణ చేస్తామని సీఐ రాపెల్లి సంతోష్‌కుమార్‌ తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube