డ్రైవింగ్ లో ఆరితేరిన డ్రైవర్లు తమ చేతిలో ఉన్న వాహనాన్ని ఒక్క ఆట అడుకుంటారు.కొన్ని కొన్ని సార్లు ఇక వాళ్ళను ఆపడం కూడా కష్టం.
అలా చేసి రిస్క్ లో పడ్డ డ్రైవర్లను మనం చూశాం.ఏదైనా రిస్క్ అవుతుందా లేదా అని చూడకుండా స్టంట్ లు చేస్తారు.
కొన్ని రకాల స్టంట్ లు చూడడానికి వినోదభరితంగానే ఉంటాయి.మనం చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు కూడా.
కాని కొంత మంది అది రిస్క్ అని తెలిసి కూడా స్టంట్ లు వేసి రిస్క్ లో పడతారు.
అలా చెక్క వంతెనపై ఓ డ్రైవర్ చేసిన స్టంట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఆ చెక్క వంతెన మీద దాని బరువుకు తగ్గట్టు ఒక చిన్న కారు వెళ్లడమే ఇక ఏకంగా ట్రక్కు వెళితే పరిస్థితి ఏంటి.ఆ చెక్క వంతెనపై మెల్లగా ట్రక్కును ముందుకు తీసుకొస్తున్నాడు.
అలా వంతెన మధ్య వరకు వచ్చాడు.అప్పటివరకు పటిష్టంగా ఉన్న వంతెన ఒక్కసారి కుప్పకూలడంతో ట్రక్కు వంతెన మీది నుండి నదిలో పడింది.
ఈ వ్యవహారాన్ని మొత్తం ఓ వ్యక్తి వీడియో తీసి నెట్టింట్లో వదిలాడు.ఇక చెప్పేదేముంది వీడియో వైరల్ గా మారింది.
మీరు కూడా ఓ లుక్కేయండి మరి.