సింగర్ గా మారిన తమన్నా.. అనుష్క ఏమందంటే..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క, తమన్నా దాదాపు ఒకే సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు.తమన్నా హ్యాపీ డేస్ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టగా అనుష్క సూపర్ సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టారు.

 Tamanna Bhatia Sing Song Hrithik Roshan Mission Kashmir Movie,  Mission Kashmir-TeluguStop.com

ఇండస్ట్రీలోకి ఈ ఇద్దరు హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చి 15 సంవత్సరాలు అయినా ఇద్దరికీ అవకాశాలు తగ్గడం లేదు.తమన్నా ఇప్పటికీ గ్లామరస్ రోల్స్ లో ఎక్కువగా నటిస్తుంటే అనుష్క మాత్రం లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తున్నారు.
ప్రస్తుతం తమన్నా తెలుగులో సీటీమార్, అంధాధూన్, గుర్తుందా శీతాకాలం సినిమాల్లో నటిస్తున్నారు.అయితే తమన్నా తాజాగా తనలో ఎవరికీ తెలియని కొత్త టాలెంట్ ను బయటపెట్టారు.

మిషన్ కశ్మీర్ సినిమాలోని సోచే కే జీలోన్ పాటను అద్భుతంగా పాడారు.తమన్నా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పాట పాడిన వీడియోను పోస్ట్ చేయగా ఆ పాటకు ఇప్పటివరకు 1,60,300 లైకులు రావడం గమనార్హం.

ఇప్పటివరకు తమన్నాకు మంచి నటిగా, డ్యాన్సులు బాగా చేస్తుందని పేరుంది.తనలో మంచి గాయని కూడా ఉందని తమన్నా సోషల్ మీడియా వేదికగా ప్రూవ్ చేయడంతో భవిష్యత్తులో దర్శకనిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్లు ఆమెకు సింగర్ గా కూడా అవకాశాలు ఇస్తారేమో చూడాలి.తమన్నా సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేయగా హీరోయిన్ అనుష్క తన అధికారిక ఖాతా ద్వారా లవ్ సింబల్ తో పాటు హగ్ ఎమోజీని కామెంట్ గా పెట్టారు.

మరోవైపు తమన్నా నటిస్తున్న రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

తమన్నా హిందీలో నటించిన భోలే చూడియాన్ సినిమాతో పాటు క్వీన్ రీమేక్ దటీజ్ మహాలక్ష్మీ కూడా త్వరలో విడుదల కానుంది.బాహుబలి సినిమాలో తమన్నా, అనుష్క నటించిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube