న్యూస్ రౌండప్ టాప్ 20

1.నల్గొండ జిల్లాలో చిరుత కలకలం

గత కొంతకాలంగా తెలంగాణ లో చిరుతపులి సంచారం ఆందోళన కలిగిస్తోంది తాజాగా నల్గొండ జిల్లా మునుగోడు మండలం చీకటి మామిడడలో చిరుత కలకలం రేపింది.పొలం వద్ద చిరుతను చూసి రైతులు, గీత కార్మికుల పరుగులు తీశారు.

 Andhra And Telangana Breaking Headlines, Andhra Pradesh News, Breaking News, Hea-TeluguStop.com

2.కరోనా వ్యాక్సిన్

తెలంగాణ లో రేపటి నుంచి 130 కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేపట్టబోతున్నారు.

3.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణా వ్యాప్తంగా కొత్తగా 262 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

4.హైదరాబాద్ నుంచి చికాగోకు నాన్ స్టాప్ విమానం

Telugu Andhra Pradesh, Joe Biden, Telangana, Top, Ysjagan-Latest News - Telugu

హైదరాబాద్ నుంచి చికాగోకు నాన్ స్టాప్ విమానం ను ప్రారంభించనున్నారు. నాన్ స్టాప్ విమానం ఎయిర్ ఇండియా ప్రారంభించనుంది.చికాగో నుంచి శుక్రవారం బయలుదేరే విమానం మధ్యాహ్నం 12:45 గంటలకు హైదరాబాద్ కు విమానం చేరుకోనుంది.

5.ఇండోనేషియాలో భారీ భూకంపం

ఈరోజు ఉదయం ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది.భూకంపం ధాటికి అనేక భవనాలు, ఇళ్లు నేలమట్టమయ్యాయి.రిక్టార్ స్కేల్ పై 6.2 నమోదైనట్లు గుర్తించారు.

6.ఈనెల 31న పల్స్ పోలియో

జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఈ నెల 31న నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

7.గోపూజ మహోత్సవంలో పాల్గొన్న జగన్

Telugu Andhra Pradesh, Joe Biden, Telangana, Top, Ysjagan-Latest News - Telugu

గుంటూరు జిల్లాలోని నరసరావుపేట మున్సిపల్ స్టేడియం గో పూజ మహోత్సవ కార్యక్రమం జరిగింది.ఈ మహోత్సవం లో ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు.

8.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 15,590 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

9.రేపు కేంద్ర బృందం పర్యటన

ఏపీ లోని చిత్తూరు జిల్లాలో కేంద్ర నిధులతో జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని పార్లమెంట్ సభ్యులు ఈ నెల 16న జిల్లాకు రానున్నారు.31 మంది సభ్యులతో కూడిన బృందానికి ప్రతాప్ రావు జావేద్ నేతృత్వం వహిస్తున్నారు.

10.టాటా మోటార్స్ కొత్త కారు  విడుదల

Telugu Andhra Pradesh, Joe Biden, Telangana, Top, Ysjagan-Latest News - Telugu

టాటా మోటార్స్ ” ఆల్ట్రోజ్ ట్రిమ్ ” కారుని విడుదల చేసింది.అతి త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది.

11.భారత్ పై ఐఎంఎఫ్ ప్రశంసలు

కరోనా కట్టడి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో భారత్ చర్యలు బాగున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి ( ఐఏం ఎఫ్ ) ప్రశంసించింది.

12.ఆర్థిక ప్రణాళిక ప్రకటించిన బైడన్

Telugu Andhra Pradesh, Joe Biden, Telangana, Top, Ysjagan-Latest News - Telugu

కరోనా వైరస్ నియంత్రణ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం కోసం అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడన్ నూతన ప్రణాళిక రూపొందించారు.

13.అమెరికా మా ప్రధాన శత్రువు

అమెరికా తమ ప్రధాన శత్రువని ఉత్తర కొరియా నియంత , ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మరోసారి ప్రకటించారు.

14.సుప్రీం కమిటీ నుంచి తప్పుకున్న భూపిందర్ సింగ్

Telugu Andhra Pradesh, Joe Biden, Telangana, Top, Ysjagan-Latest News - Telugu

నూతన వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాలు కేంద్రం మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ నుంచి భారతీయ కిసాన్ సంఘం అధ్యక్షుడు భూపిందర్ సింగ్ మాన్ స్వచ్ఛందంగా తప్పుకున్నారు.

15.కేంద్రం రైతు సంఘాల చర్చలు

కొత్త వ్యవసాయ సంస్కరణలు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ, ఆందోళన చేస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న చర్చలు మరోసారి ప్రారంభమయ్యాయి.

16.ప్రారంభమైన ఆంధ్ర జల్లికట్టు

Telugu Andhra Pradesh, Joe Biden, Telangana, Top, Ysjagan-Latest News - Telugu

సంక్రాంతి సంబరాలు మూడో రోజైన కనుమ ను పురస్కరించుకుని చిత్తూరు జిల్లాలోని పుల్లయ్య గారి పల్లె లో పశువుల పండుగ ప్రారంభమైంది.దీనిని ఆంధ్ర జల్లికట్టు గా పిలుస్తారు.

17.మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య కన్నుమూత

టిడిపి నాయకుడు మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య శుక్రవారం కన్నుమూశారు.ఈయన చిత్తూరు జిల్లా ఐరాల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వారు.

18.ట్రంప్ పై సోషల్ మీడియా బ్యాన్

Telugu Andhra Pradesh, Joe Biden, Telangana, Top, Ysjagan-Latest News - Telugu

మరి కొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై సోషల్ మీడియా సైట్స్, యాప్స్ వరుసగా షాకులు ఇస్తూనే ఉన్నాయి.తాజాగా ట్రంప్ ఖాతాను బ్యాన్ చేసినట్టు స్నాప్ చాట్ ప్రకటించింది.

19.గాలిపటం ఎగర వేస్తూ టిఆర్ఎస్ నాయకుడు మృతి

టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు బంగారు కృష్ణ సంక్రాంతి పండుగ సందర్భంగా బిల్డింగ్ పైకి ఎక్కి గాలిపటం ఎగర వేశారు.ఈ నేపథ్యంలో ఆయన కాలు జారి కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ఘటన ముషీరాబాద్ లో చోటుచేసుకుంది.

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Andhra Pradesh, Joe Biden, Telangana, Top, Ysjagan-Latest News - Telugu

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,450

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 49,450

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube