అనీల్‌ రావిపూడి కూడా అల్లుడు బెల్లంకొండను ఆదుకోలేక పోయాడు

సంక్రాంతి సందర్బంగా వచ్చిన అల్లుడు అదుర్స్‌ సినిమా ప్రేక్షకులను నిరాశ పర్చింది.కాస్త ఎంటర్‌ టైన్‌ మెంట్‌ మినహా సినిమాలో మరేం లేదు అంటూ రివ్యూవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 Anil Ravipudi Also Not Gave Success To Bellamkonda Sai Srinivas , Alludu Adhurs,-TeluguStop.com

రివ్యూ రేటింగ్‌ చాలా తక్కువగా వచ్చింది అనేది సోషల్‌ మీడియా చూస్తుంటే అర్థం అవుతుంది.ఈ ఈసినిమా కు సంతోష్‌ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే.

అయితే ఈ సినిమా వ్యవహారంలో అనీల్ రావిపూడి కూడా వేలు ఉంది అనేది అందరికి తెలిసిందే.సినిమా ప్రీ రిలీజ్ వేడుక సందర్బంగా తమకు సహరించిన అనీల్‌ రావిపూడి గారికి కృతజ్ఞతలు అంటూ హీరో బెల్లం కొండ బాబు చెప్పుకొచ్చాడు.

ఆయన స్క్రిప్ట్‌ నుండి ఎడిటింగ్ వరకు వేలు పెట్టారు అనేది అనధికారిక సమాచారం.ఆయన ఇన్వాల్వ్‌ అవ్వడం వల్లే కనీసం ఈమాత్రం అయినా ఉందేమో అంటూ నెటిజన్స్ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

భారీ మొత్తంలో ఖర్చు చేసినా కూడా అల్లుడు అదుర్స్‌ ను ఎవరు కాపాడలేక పోయారు.అద్బుతమైన ఎంటర్‌ టైనర్‌ అంటూ ప్రచారం చేశారు.కాని ఏ ఒక్కరు కూడా సినిమా విషయమై సరైన రీతిలో పాజిటివ్‌ గా స్పందించడం లేదు.దాంతో అసలు విషయం ఏంటీ అనేది క్లారిటీ వచ్చేసింది.

అల్లుడు అదుర్స్‌ కూడా బెల్లం కొండ కెరీర్‌ లో కమర్షియల్‌ సక్సెస్ ను వేయలేక పోయింది.ఒక వైపు చత్రపతి సినిమా రీమేక్ చేసేందుకు సిద్దం అవుతున్న బెల్లం కొండకు ఈ ఫలితం మింగుడు పడటం లేదు.

ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదు అంటూ ఆయన సన్నిహితులతో అంటున్నాడు.అనీల్ రావిపూడితో పాటు ఇంకా చాలా మంది సలహాలు సూచనలు కూడా సినిమాకు వినియోగించారు.

అయినా కూడా సంక్రాంతి రేసులో వెనక పడ్డట్లు అయ్యిందని బెల్లం కొండ సన్నిహితులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube