బుద్దిలేని యూవీ క్రియేషన్స్‌.. సినిమా నిర్మాణం మానుకోవాలంటూ ట్రోల్స్‌

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్‌ డేట్స్ రెగ్యులర్‌ గా వస్తూనే ఉంటాయి.కాని ప్రభాస్‌ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా అప్ డేట్‌ విషయమై అభిమానులు గత రెండేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు.

 Prabhas Fans Fire On Uv Creation, Prabhas, Radheshyam Movie Teaser ,radhesyem, R-TeluguStop.com

ఫస్ట్‌ లుక్‌ కోసం ఏడాది వెయిట్‌ చేసిన అభిమానులు ఇప్పుడు టీజర్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.ఖచ్చితంగా సంక్రాంతికి రాధేశ్యామ్‌ టీజర్‌ వస్తుందని అంతా ఆశించారు.

కాని మరోసారి అభిమానులను నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిరాశ పర్చింది.గతంలో ఒకసారి యూవీ క్రియేషన్స్‌ వారికి పబ్లిసిటీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదు.

కనుక వారిని ఇండస్ట్రీ నుండి బ్యాన్‌ చేయాలి.ప్రభాస్ వంటి స్టార్‌ హీరోతో సినిమా చేస్తున్న సమయంలో సందడి ఏ రేంజ్‌ లో ఉండాలో ఆ రేంజ్ లో సందడి ఉండటం లేదు అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఉన్న సందడితో పాటు నెట్టింట సందడి కూడా అభిమానులు చాలా ప్రెస్టీజ్‌ గా ఫీల్ అవుతూ ఉంటారు.

రికార్డు స్థాయిలో నెట్టింట వ్యూస్ మరియు పోస్ట్‌ లు అంటూ సందడి చేసుకుంటున్నారు.

కాని ప్రభాస్ అభిమానులకు మాత్రం అదేమి లేకుండా యూవీ క్రియేషన్స్‌ వారు చేశారు.సంక్రాంతికి ఒక వేళ రాధేశ్యామ్‌ టీజర్ వచ్చి ఉంటే ఇతర రికార్డులు అన్ని కూడా పక్కకు పోయేవి అనడంలో సందేహం లేదు.

ప్రభాస్‌ కు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో ఖచ్చితంగా కేజీఎఫ్ 2 టీజర్‌ రికార్డులు కూడా బ్రేక్‌ అయ్యేవి కాని మేకర్స్ మాత్రం సంక్రాంతి పండుగ బిజీలో పడి సినిమా టీజర్ ను విడుదల చేయలేదు.ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీలో ఉండటం ఎందుకో అంటూ ప్రభాస్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బుద్ది లేని యూవీ క్రియేషన్స్‌ నిర్మాతలు అంటూ చాలా మంది నెటిజన్స్‌ కామెంట్ చేస్తున్నారు.ఇలా ప్లానింగ్‌ తెలియని వారు సినిమాలు నిర్మించడం మానేయాలంటూ మరి కొందరు సూచిస్తున్నారు.

మరి యూవీ వారు దీనికి ఏం సమాధానం ఇస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube