అమెరికాలో ఘోరం..మళ్ళీ కాల్పుల కలకలం..!!

అగ్ర రాజ్యం అమెరికాలో మరో సారి కాల్పుల కలకలం రేగింది.తుపాకి పట్టుకున్న ఓ యువకుడు ఉన్మాదంగా కంటికి కనిపించిన వారిని కాల్చి చంపేశాడు.

 Horror In America Is Again A Firing Spree,  Shooting In The United States, Chica-TeluguStop.com

ఈ ఘటనతో ఒక్క సారిగా చికాగో రాష్ట్రం ఉలిక్కి పడింది.అయితే ఈ ఘటనకు కారణమైన వ్యక్తిని పోలీసు అధికారులు కాల్చ చంపేశారు.ఈ ఘటన వివరాలలోకి వెళ్తే.పోలీసు అధికారులు తెలిపిన వివరాలప్రకారం.

జేసన్ నైటింగేల్ అనే అనే యువకుడు చికాగోలో రద్దీగా ఉన్న ప్రాంతంలో తిరుగుతూ కనపడిన వారికి కాల్చడం మొదలు పెట్టాడు.ఒక్క సారిగా జరిగిన ఈ ఘటనతో ఉలిక్కిపడిన ప్రజలు రోడ్లపై పరుగులు తీయడం మొదలు పెట్టారు.

పరిగెడుతున్న వారిని సైతం వెంటాడి మారీ కాల్చిన ఈ యువకుడు మొత్తం ముగ్గురి మృతికి కారణమయ్యాడు.వారిలో చైనా కు చెందిన ఇరాన్ ఫాన్ అనే వ్యక్తీ తో పాటు మరో ఇద్దరు కూడా మృతి చెందారు.

నలుగురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలవ్వగా వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.గాయలపాలైన వారిలో వృద్దులు, బాలిక ఉన్నారని వారందరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు.అయితే

Telugu Biden, Chicago, China, Gun, Iran-Telugu NRI

స్థానికుల సమాచారంతో హుటాహుటిన కాల్పులు జరిగే ప్రాంతానికి వెళ్ళిన పోలీసులు జేసన్ నైటింగేల్ ను లొంగిపోవాలని హెచ్చరిచారు.కానీ నిందితుడు పోలీసులపై కాల్పులు జరపడంతో చేసిది లేక ఎదురు కాల్పులు చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.అయితే అతడు కాల్పులు ఎందుకు చేశాడు, ఎక్కడి నుంచీ వచ్చాడు అనే విషయాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టామని త్వరలో అని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

అమెరికాలో తుపాకీ కల్చర్ కి చెక్ పెట్టాలని విచ్చలవిడిగా తుపాకులు అమ్మే విధానం పై నిషేధం విధించాలని ఎన్నో ఏళ్ళుగా స్వచ్చందం సంస్థలు పోరాటాలు చేస్తున్న ఫలితాలు మాత్రం శూన్యం అవుతున్నాయి.బిడెన్ రాకతో అయినా తుపాకీ సంస్కృతికి చెక్ పడుతుందోమోనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి స్వచ్చందం సంస్థలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube