లాస్య యూట్యూబ్ ఛానల్ హ్యాక్.. ఎమోషనల్ అయిన యాంకర్..?

ఈ మధ్య కాలంలో సైబర్ మోసగాళ్లు సెలబ్రిటీలకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను, యూట్యూబ్ ఛానెళ్లను హ్యాక్ చేస్తున్నారు.హ్యాక్ చేసిన ఖాతాలు, ఛానెళ్లను కొందరు సైబర్ మోసగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు.

 Star Anchor Lasya Manjunath Youtube Channel Hacked , Account Hacked, Lasya Manj-TeluguStop.com

బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న లాస్య యూట్యూబ్ ఛానల్ “లాస్య టాక్స్” హ్యాక్ అయింది.స్వయంగా లాస్య ఒక వీడియో విడుదల చేసి ఈ విషయాన్ని వెల్లడించారు.

లాస్య వీడియోలో తన యూట్యూబ్ ఛానల్ లాస్య టాక్స్ హ్యాక్ అయిందని.ఎవరు హ్యాక్ చేశారు.? ఎందుకు హ్యాక్ చేశారు.? ఎప్పుడు హ్యాక్ చేశారనే విషయాలు తనకు తెలియదనీ పేర్కొన్నారు.మొన్న సాయంత్రం తనకు తెలియకుండా తన ఛానల్ నుంచి లైవ్ వెళ్లిపోవడం వల్ల ఈ విషయం తనకు తెలిసిందని అన్నారు.నా ఛానల్ నుండి లైవ్ వెళ్లుతోందని తెలిసి తనకు చాలా బాధ వేసిందని లాస్య పేర్కొన్నారు.

Telugu Hacked, Lasya Manjunath, Lasya, Youtube Channel-Movie

తన టీం యూట్యూబ్ ఛానెల్ పై వర్క్ చేస్తోందని ఛానల్ మళ్లీ బ్యాక్ వస్తుందని చెప్పారని పేర్కొన్నారు.చాలామంది అభిమానులు సోషల్ మీడియా ఖాతాలలో ఛానెల్ మళ్లీ బ్యాక్ వస్తుందని సపోర్ట్ చేస్తున్నారని లాస్య పేర్కొన్నారు.అయితే ఛానెల్ మళ్లీ రావడానికి కొంచెం సమయం అయితే పట్టవచ్చని లాస్య తెలిపారు.కొత్త వీడియోలతో అభిమానుల ముందుకు వస్తానని అయితే అందుకు కొంత సమయం పడుతుందని లాస్య అన్నారు.

యూట్యూబ్ ఛానల్ హ్యాక్ కావడంతో లాస్య వీడియోలో ఎమోషనల్ అయ్యారు.బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొని లాస్య ఇతర కంటెస్టెంట్లకు గట్టి పోటీని ఇచ్చారు.

లాస్య టాప్ 5 కంటెస్టెంట్లలో ఉంటారని చాలామంది భావించినా 11వ వారం లాస్య బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత లాస్య ప్రముఖ చానెళ్లలో ప్రసారమవుతున్న ఈవెంట్లలో పాల్గొంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube