రెడ్ చిత్రాన్ని ఎనిమిది భాషల్లో దింపేస్తున్న రామ్

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రెడ్’ అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమాను గతేడాదిలోనే రిలీజ్ చేయాలని చూసినా, కరోనా కారణంగా అది వాయిదా పడింది.

 Ram Red Movie To Release In Eight Languages, Ram Pothineni, Red Movie, Kishore T-TeluguStop.com

దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో రామ్ డ్యుయెల్ రోల్ చేస్తుండటంతో రెడ్ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఇప్పటికే మంచి ఆదరణ దక్కించుకోవడంతో రెడ్ చిత్రం ఖచ్చితంగా హిట్ కొడుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

అయితే రామ్ నటిస్తున్న ఈ సినిమాను కేవలం తెలుగులోనే రిలీజ్ చేయడం లేదు.ఈ సినిమాను ఏకంగా 8 భాషల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

ఇప్పుడున్న యంగ్ హీరోల్లో ఈ ఫీట్ చేసిన హీరోగా రామ్ నిలుస్తాడు.రెడ్ చిత్రాన్ని తెలుగుతో పాటు కన్నడలో ఒకేసారి సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేస్తున్నారు.

మలయాళంలో ఈ సినిమాను జనవరి 22న, హిందీలో జనవరి నెలాఖరున రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.ఇక బెంగాలీ, భోజ్‌పురి, మరాఠీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేసే డేట్‌ను ఇంకా ఫైనల్ చేయలేదు.

అటు తమిళంలో ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఏదేమైనా రెడ్ చిత్రాన్ని ఇలా ఎనిమిది భాషల్లో రిలీజ్ చేయడం నిజంగా విశేషమనే చెప్పాలి.

రామ్ డ్యుయెల్ రోల్‌లో చేసే పర్ఫార్మెన్స్ ఈ సినిమాకే హైలైట్ కానుందని చిత్ర యూనిట్ అంటోంది.ఇక ఈ సినిమాలో వచ్చే ట్విస్టులు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో నివేధా పేతురాజ్, మాళవికా శర్మ, అమృత అయ్యర్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా, ఈ సినిమాను స్రవంతి రవికిషోర్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.సంక్రాంతి బరిలో రిలీజ్ అవుతున్న రెడ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube