వైరల్ అవుతున్న నెపోటిజంపై సోహెల్ ఖాన్ భార్య వ్యాఖ్యలు

బాలీవుడ్ స్టార్ సుశాంత్ మరణం తరువాత సినిమా పరిశ్రమలో పెద్ద ఎత్తున నెపోటిజం ఉందంటూ పెద్ద దుమారమే రేగింది.ఎటువంటి వారసత్వం లేని వారికి సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని, కంగనా రనౌత్ లాంటి వారు గళమెత్తిన పరిస్థితి ఉంది.

 Sohail Khan's Wife Comments On Nepotism Going Viral,  Bollywood ,salman Khan ,-TeluguStop.com

తమకు నచ్చిన వారికే అవకాశాలు ఇస్తూ, వారే స్టార్లుగా చలామణి అవుతున్నారని, ఇక బయటవారికి నెపోటిజంతో వారిని తీవ్ర వేదనకు గురయ్యేలా ప్రవర్తిస్తారని ఇలా రకరకాల ఆరోపణలు వినిపించాయి.కాని ఈ నెపోటిజం ఆరోపణలపై బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరుడు సోహెల్ ఖాన్ భార్య,ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సీమాఖాన్ స్పందించింది.

బాలీవుడ్ పెద్ద పెద్ద కుటుంబాల వ్యక్తులెవరూ పెద్ద స్టార్లుగా మారలేదని, తన భర్త సోహెల్ ఖాన్ కూడా పెద్ద స్టార్ అవలేదని, టాలెంట్ ఉంటేనే సినీ పరిశ్రమలో అవకాశాలు వస్తాయని, ప్రతి ఒక్కరు అవకాశాల కోసం ప్రయత్నించాల్సిందేనని, ప్రేక్షకులు అదరించకపోతే అవకాశాలు రావడం ఎవరికైనా అంత సులభం కాదని సీమాఖాన్ తెలిపింది.మనకు ఉన్న టాలెంట్ మాత్రమే మాట్లాడుతుందని, ఎంత పెద్ద కుటుంబం అని అవకాశాలు ఇచ్చే సంస్కృతి ఎక్కువ సినిమా పరిశ్రమలో ఉండదని తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube