గుజరాత్ స్థానిక ఎన్నికలపై ఆప్ దృష్టి

దేశ ప్రదాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం అయిన గుజరాత్ లో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ సందర్భంగా అక్కడ అధికార ప్రతిపక్ష పార్టీలు తమ తమ అభ్యర్థుల జాబితాను సిద్దం చేసుకుంటున్నాయి.

 Aap Stand In Gujarat Local Body Elections Release The Candidates List,aap, Gujar-TeluguStop.com

మొదటి నుండి గుజరాత్ లో బీజేపీ హవ కొనసాగుతూ వస్తుంది.అందుకు చెక్ పెట్టేందుకు రాజకీయ పార్టీలు తమ తమ కార్యాచరణలో ఉన్నాయి.

ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఓ కీలక ప్రకటన చేసింది.గుజరాత్ లో స్థానిక సంస్థలు జరగనున్న నేపథ్యంలో మొదట విడుతగా 504 మంది అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది.
బి‌జే‌పి పార్టీ కి ప్రత్యామ్నాయ శక్తిగా ఆప్ పార్టీ మారుతుందని ఆ పార్టీకి చెందిన నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు ఆప్ డిల్లీ ఎం‌ఎల్‌ఏ మరియు పార్టీ అధికార ప్రతినిది అతిషి ఆధ్వర్యలో మొదటి విడుత జాబితాను విడుదల చేసింది.

గుజరాత్ లో జరగబోయే స్థానిక సంస్థల స్థానాల్లో ఆప్ పార్టీ అన్నీ స్థానాల్లో పోటీ చేస్తుందని అతిషి అన్నారు.ఒక్క స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాదు అసెంబ్లి, పార్లమెంట్ ఎన్నికలోనూ ఆప్ పార్టీ పోటీ చేస్తుందని ఆమె అన్నారు.

బీజేపీ కి బయపడని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కేజ్రీవాల్ మాత్రమే అన్నారు.బీజేపీ పాలన పై దేశ ప్రజలు విసిగిపోయారని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube