వైసీపీలో ఆ న‌లుగురు మంత్రులే హాట్ టాపిక్‌... వీళ్ల‌ను సైలెంట్ చేసిందెవ‌రు..!

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కేబినెట్లో మంత్రులుగా ఉన్న‌వారిలో చాలా మంది అంత యాక్టివ్‌గా ఉండ‌డం లేద‌న్న అప‌వాదు అయితే ఉంది.మొత్తం 25 మంది మంత్రుల్లో ఐదారుగురు మిన‌హాయిస్తే మిగిలిన వారు ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోతున్నారు.

 That Four Ministers Became Hot Topic In Ycp..who Made Them Silent, Four Minister-TeluguStop.com

వీరు రాజ‌కీయంగానే కాకుండా.క‌నీసం త‌మ శాఖ మీద కూడా ప‌ట్టు కోసం పాకులాడాల్సిన ప‌రిస్థితి ఎదుర్కొంటున్నారు.

చాలా మంది మంత్రులు క‌నీసం ప్రెస్‌మీట్లు పెట్టి విప‌క్షాల‌కు కౌంట‌ర్లు ఇచ్చే ప‌ని కూడా చేయ‌డం లేదు.అస‌లు కొంద‌రు మంత్రులు ఉన్నారో ?  లేదో ?  కూడా తెలియ‌డం లేదు.

ఇక కొంద‌రు మంత్రులు శాఖా ప‌రంగా ప్ర‌భావం చూప‌క‌పోయినా క‌నీసం రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి ప‌ర్య‌ట‌న‌లు కూడా చేయ‌డం లేద‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.వీరు కేవ‌లం త‌మ నియోజ‌క‌వ‌ర్గాల బోర్డ‌ర్ల‌ను దాటి రావ‌డం లేదంటున్నారు.

వీరిలో విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ ఉన్నారు.మంత్రి అయిన కొత్త‌లో విశాఖ రాజ‌కీయాల‌ను త‌న గ్రిప్‌లోకి తెచ్చుకోవాల‌ని ఆరాట‌ప‌డిన ఆయ‌న దూకుడుకు విజ‌య‌సాయి రెడ్డి బ్రేకులు వేశాడ‌ని అంటున్నారు.

Telugu Amalapuram, Ap, Avanthi, Bhimili, Hot Topic, Ministers, Ministry, Press M

ఏదేమైనా అవంతి ఇప్పుడు పూర్తిగా భీమిలికే ప‌రిమిత‌మైన ప‌రిస్థితి ఉంది.కొద్ది రోజులుగా అవంతి పూర్తిగా మౌనం పాటిస్తున్నారు.ఇక జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌కే చెందిన మైనార్టీ నేత అంజాద్ బాషా కూడా క‌డ‌ప నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితం అయ్యారు.ఆయ‌న మైనార్టీ మంత్రిగా ఉండి చివ‌ర‌కు త‌న వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు కూడా చేరువ కాలేని ప‌రిస్థితి.

అలాగ‌ని క‌డ‌ప జిల్లాలో ఎమ్మెల్యేలు అంద‌రూ సీనియ‌ర్లు కావ‌డంతో వాళ్లే మంత్రులుగా ఫీల‌వుతుంటారు.ఇక అంజాద్ ఎక్క‌డా వేలు పెట్ట‌లేని ప‌రిస్థితి.

ఇక మ‌రో డిప్యూటీ సీఎం అయిన పుష్ప శ్రీవాణి జిల్లాలో బొత్స దూకుడు ముందు బేజార‌వ్వ‌డంతో పాటు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన కురుపాంకు పరిమితం అవుతున్నారు.ఇక అమ‌లాపురం ఎమ్మెల్యే, సీనియ‌ర్ నేత పైగా గ‌తంలో కూడా మంత్రిగా ఉన్న పినిపే విశ్వ‌రూప్ ప‌రిస్థితి కూడా అంతే అంటున్నారు.

ఆయ‌న జిల్లాకు మంత్రిగా నిన్న మొన్న‌టి వ‌ర‌కు కోన‌సీమ‌కే ప‌రిమిత‌మ‌య్యారు.ఇప్పుడు అమ‌లాపురం దాటే ప‌రిస్థితి లేదు.

స్థానిక ప‌రిస్థితుల‌తో పాటు కొంద‌రు నేత‌ల డామినేష‌న్ కార‌ణంగానే వీరు సైలెంట్ అవుతోన్న ప‌రిస్థితి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube