రేవంత్ టార్గెట్ గా బీజేపీ ఫోకస్ ? ఇక సంచలనాలేనా ?

కొత్త సంవత్సరంలో కిక్ ఎక్కించే నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా, వాటిని అమలు చేసి చూపించి తమ సత్తా చాటుకోవాలని, తెలంగాణలో టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను పూర్తిగా బలహీనం చేసి బలమైన పార్టీగా ముద్ర వేయించుకోవాలనే ఆకాంక్ష బీజేపీ అగ్రనేత లలో స్పష్టంగా కనిపిస్తోంది.అందుకే కొత్త ఏడాదిలో సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ, బలమైన శక్తిగా అవతరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

 Revanth Reddy Bjp Telangana Komatireddy Rajagopal Reddy Venkatreddy Bandi Sanjay-TeluguStop.com

ముఖ్యంగా తమకు ప్రధాన రాజకీయ శత్రువుగా కేసీఆర్ ఉన్నారు.ఇక కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నా, ఆ పార్టీలో కీలక నాయకుడు రేవంత్ రెడ్డి తన ప్రభావాన్ని చూపిస్తూ వస్తున్నారు.

దీంతో కేసీఆర్, రేవంత్ ప్రభావాన్ని అడ్డుకుంటూ, వారి హవా తగ్గించేందుకు బిజెపి అడుగులు వేస్తోంది.బీజేపీ లోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేశారు.వివిధ పదవులను సైతం ఆఫర్ చేశారు.అయినా బిజెపి లోకి వెళ్లేందుకు రేవంత్ అంతగా ఇష్టపడకపోవడం, కాంగ్రెస్ లోనే ఉంటూ అధికారం సాధించే దిశగా అడుగులు వేస్తున్న తీరు, బీజేపి నాయకులకు ఆగ్రహం కలిగిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ లో మిగిలి ఉన్న కీలక నాయకులు అందరినీ తమ దారిలోకి తెచ్చుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది.

తాజాగా కొత్త సంవత్సరం రోజున కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను బీజేపీలో చేరుతున్నానని ప్రకటించడం కలకలం రేపింది.

ప్రస్తుతం రేవంత్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ఇద్దరిలో ఒకరికి పిసిసి అధ్యక్ష పదవి వస్తుందనే ప్రచారం గట్టిగా వినిపిస్తున్న తరుణంలో వెంకట్ రెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి బిజెపి లోకి వెళ్తున్నాను అని ప్రకటించడం వ్యూహాత్మకంగానే కనిపిస్తోంది.రాజగోపాల్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ లో చాలా మంది సీనియర్ నాయకులు బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Telugu Bandi Sanjya, Congress, Jagga, Komati Venkat, Rajagopal Reddy, Revanth Re

ముఖ్యంగా రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి కన్ఫామ్ కాగానే, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వి.హనుమంత రావు ,సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య  ఇలా చాలామందే ఉన్నట్టు తెలుస్తోంది.వీరందరినీ చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ ను మరింత బలహీనం చేసి రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి కి రాజకీయ అవకాశం లేకుండా చేయాలని, ఆయన కాంగ్రెస్ ను వీడి బీజేపీ లో చేరే పరిస్థితులను కల్పించాలని బీజేపీ అధిష్టానం వ్యూహాలు పన్నుతున్నట్టుగా ముందుకు వెళ్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube