ఏంటి అని ఆశ్చర్యం వేస్తుంది కదా.నిజం అండి బాబు.
ప్రేమ అనురాగాలు కేవలం మనుషులకే కాదు జంతువులు పక్షుల్లో ఉంటాయ్ అనేది అక్షరాలా నిజం.ఏవైనా జంట పక్షులలో ఒక దాన్ని వేటగాడు కాల్చి చంపితే రెండో పక్షిని కూడా చంపాలని.
లేదంటే దాని చావు కంటే దాని బాధని చూసి మనకు కన్నీళ్లు వస్తాయని ఎంతోమంది అంటుంటారు.అది అక్షరాలా నిజం.
ఇక అలానే ఓ బాతు జాతికి చెందిన పక్షి తోడును కోల్పోయి ఏకంగా 23 హై స్పీడ్ రైళ్లను ఆపేసింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.రెండు పక్షులు ఆకాశంలో ఎంతో ఆనందంగావిహరిస్తుండగా .ఉన్నట్టుండి ఒక పక్షి హై స్పీడ్ రైల్వే లైన్ కు సంబంధించి కరెంటూ తీగ తగిలి పట్టాలపై పడి చచ్చిపోయింది.అది చుసిన మరో పక్షి దాని తోడు పక్షి హఠాత్ మరణంతో తోడును కోల్పోయి ఒంటరి అయ్యింది.ఎటు వైపు వెళ్లాలో అర్ధం కానీ ఆ పక్షి ప్రమాదంలో తోడును పోగొట్టుకున్న పక్షి కోసం ఆ రైలు పట్టాల పైనే తిరగడాన్ని అధికారులు గమనించారు.దీంతో ఆ పక్షి ని పట్టుకునేందుకు దాదాపు గంట పాటు శ్రమించారు.చివరికి హై స్పీడ్ రైలు పట్టాలపై తిరుగుతున్న పక్షిని పట్టుకున్నారు.
అనంతర ఆ పక్షిని అక్కడ ఉన్న నీటిలో వదిలేసారు.అయితే అలా ఆ పక్షి ని పట్టుకునే సమయంలో అక్కడ తిరగాల్సిన 23 రైళ్లను అధికారులు ఆపెయ్యడంతో ఆ వైపు నుంచి వెళ్లాల్సిన 23 రైల్లు ఎంతో ఆలస్యంగా వెళ్లాయ్.
కాగా ఇలా ఆలస్యం అవ్వడం ఒక ఎత్తు అయితే అక్కడ ఉన్న ప్రయాణికులు ఈ పక్షి వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టగా అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయ్.