సినీ పరిశ్రమలో నటీనటుల వ్యక్తిగత సమాచారంకు సంబంధించిన విషయాల పైనే కాకుండా.వాళ్ల కుటుంబ సభ్యులపై కూడా ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచుతుంది మీడియా.
అందుకే కాబోలు ఎవరు కంటికి దొరకకూడదు అనుకుంటారో.నేరుగా వాళ్ళ కళ్ళల్లోనే పడతారు మన స్టార్ కుటుంబ సభ్యులు.
ప్రస్తుతం ఓ మీడియాకు దొరికిన ఫోటోలో ఫలానా మెగాస్టార్ మనవరాలు ప్రేమలో పడిన విషయాన్ని తీసుకొచ్చింది.
ఇంతకీ ఆ మెగాస్టార్ ఎవరో కాదు… మన బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్.
ఆయన బాలీవుడ్ లో గొప్ప నటుడు.మంచి పేరు సంపాదించుకున్న ఆ నటుడు ప్రస్తుతం ఆయన మనవరాలు వల్ల ఆయన పేరు మారుమ్రోగుతోంది.
అమితాబ్ మనుమరాలు నవ్య నవేలి నందా.తను తన తాత గారి తరపున ఓ సెలబ్రిటీగా మారింది.
గత కొన్ని రోజులుగా నవ్య గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వార్తల్లో వినిపిస్తున్నాయి.
ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ జావేద్ జాఫ్రీ కుమారుడు మీజాన్ జాఫ్రీ తో ప్రేమ లో ఉన్నట్టు.పైగా వాళ్ళ మధ్య డేటింగ్ ఉందని పలుమార్లు వార్తలు బయటకు వచ్చాయి.అంతేకాకుండా సోషల్ మీడియాలో ఫోటోలను తెగ షేర్ చేస్తూ ఉండేది నవ్య.
ఆ ఫోటోల వల్ల వాళ్ళిద్దరి మధ్య నిజంగానే ఏదో నడుస్తుందనే పుకార్లు వినిపించేవి.అయితే ఇటీవలే నవ్య తో రిలేషన్ షిప్ గురించి మీజాన్ కొన్ని విషయాలు తెలిపాడు.” మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు.మేము మంచి స్నేహితులం” అంటూ చెప్పుకొచ్చాడు.
దీంతో అతను నవ్య పై ఉన్న విషయాన్ని తేల్చి చెప్పగా.నేటి జనులు వాళ్ళ విషయం గురించి పక్కకు తప్పుకున్నారు.
అయితే ఇదిలా ఉంటే నవ్య తాజాగా మరో ఫోటోను షేర్ చేసింది.సోఫా లో కూర్చుని ముఖం చాటేసుకున్న ఫోటోను షేర్ చేయగా.దానికి మీజాన్ “నీ ముఖం ఏది” అంటూ లవ్ గుర్తు ఎమోజీ తో కామెంట్ చేశాడు.దీంతో వీరిద్దరి మధ్య నిజంగానే ప్రేమ నడుస్తుందని నేటి జనులు నమ్ముతున్నారు.