కొత్తిమీర అన్ని రకాల వంటలలో మంచి టేస్ట్ ఇస్తుందని బాగా ఉపయోగిస్తుంటారు.మీరు కూడా ఇలానే ఉపయోగిస్తున్నారు అయితే మీకోసం కొన్ని సూచనలు.
కొత్తిమీర ఉపయోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నా విషయం మనం తెలుసుకుందాం.
ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ కొత్తిమీరపై ఓ అధ్యనం చేసి కొత్తిమీర సాగులో విపరీతమైన కెమికల్స్ పోసి ప్యూరిఫై చేసేందుకు కొందరు వ్యాపారస్తులు సల్ఫర్ ను ఉపయోగిస్తున్నట్లు వారు గ్రహించారు.
ఇలా సల్ఫర్ ను ఉపయోగించడం వల్ల కొత్తిమీర మరికొన్ని రోజులు చాలా ఫ్రెష్ గా ఉండడంతో పాటు దాన్ని ఇంకొన్ని రోజులు ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటున్నట్లు అధికారులు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.ఇలా కొందరి వ్యాపారస్తులపై దాడులు నిర్వహించి సల్ఫర్ ను కూడా సీజ్ చేశారు.
ఇందులో భాగంగానే కొత్తిమీరను శుభ్రం చేసే ప్రక్రియలో భాగంగా సల్ఫర్ ఉపయోగించవద్దని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు తెలిపారు.ఇలా తెలిపిన కూడా కొందరు వ్యాపారస్తులు మాత్రం వారి తీరును మార్చుకోవడం లేదు.
అంతేకాకుండా సల్ఫర్ ఉపయోగించడం వల్ల చాలా మంచి జరుగుతుందని కొందరు వ్యాపారస్తులు పేర్కొంటున్నారు.
రైతులు పంటను కోసి మార్కెట్ లోకి తీసుకొని వచ్చిన తర్వాత 2 రోజులు పడుతుంది.కొనుగోలు చేయడానికి, ఆ తర్వాత కొనుగోలు చేసిన తర్వాత ఇంట్లో కొన్ని రోజులు పాటు ఫ్రెష్ గా ఉండాలంటే ఇలా చేయాలని వారి తప్పును సమర్థించుకుంటున్నారు.ఇక మరోవైపు సల్ఫర్ అనేది శరీరంలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు కాకుండా సహాయపడుతుందని అంటున్నారు.
ఇది ఇలా ఉండగా అధికారులు మాత్రం అధిక మోతాదులో సల్ఫర్ ఉపయోగించడం వల్ల అనేక అనర్థాలు ఎదురవుతాయని వారు తెలియజేస్తున్నారు.సల్ఫర్ ను ఎక్కువగా ఉపయోగిస్తే కడుపులో మంటలు పుట్టడం, విరోచనాలు, దగ్గు, చర్మం, కళ్ళు మంటలు వస్తాయని వారు తెలియజేస్తున్నారు.
ఇక మార్కెట్లో కొత్తిమీర చూడడానికి చాలా ఫ్రెష్ గా ఉందని చాలా మంది అవసరం అయిన వాటి కంటే ఎక్కువగా కొనుగోలు చేసి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు.ఇలా విరివిగా ఉపయోగించుకోవడానికి ముందు ఒకసారి దాన్ని శుభ్రం చేసుకొని ఉపయోగించుకోవడం చాలా మంచిది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇలా కొత్తిమీరను శుభ్రం పరచకుండా ఉపయోగిస్తే రోగాల బారిన పడినట్టే.కాబట్టి కొత్తిమీర కూరల్లో ఉపయోగించే ముందు కచ్చితంగా కడిగి ఉపయోగించుకోవాలి.