వైరల్: మారడోనా కు ఘనంగా నివాళి పలికిన తమిళనాడు లోని బేకరీ..!

కొంత మంది ప్రముఖులకు నివాళులు విన్నుత రీతిలో అర్పించడం మనం గమనిస్తూనే ఉంటాం.ఈ తరుణంలో తమిళనాడు రాష్ట్రంలోని ఒక ప్రముఖ బేకరీ సంస్థ ఫుట్ బాల్ లెజెండ్ మారడోనాకు వారి స్టైల్ లో నివాళులు అర్పించారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.60 సంవత్సరాలు ఉన్న మారడోనా ఇటీవల హార్ట్ ఎటాక్ తో మృతి చెందిన సంగతి అందరికి విదితమే.డిగో మారడోనాకు తమిళనాడులోని రామనాథపురంలోని ఒక ప్రముఖ బేకరీ ఆరడుగుల కేక్ విగ్రహాన్ని తాయారు చేసి నివాళులు అర్పించారు.

 Viral Bakery In Tamil Nadu  Pays Homage To Maradona, Ramanathapuram,  Bakery,  6-TeluguStop.com

ఈ కేకును తయారు చేసేందుకు వారు 60 కేజీల చక్కెర, 270 గుడ్లను వారు ఉపయోగించారు.

ప్రతి సంవత్సరం ఈ బేకరి వారు క్రిష్టమస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేసి డిస్ప్లే కు ఉంచడం వారి స్పెషాలిటీ.అంతేకాకుండా గత కొన్నాళ్లుగా ఇళయరాజా, అబ్దుల్ కలాం లాంటి ప్రముఖుల విగ్రహాలను తయారు చేశామని బేకరీ వారు తెలియజేస్తున్నారు.

ఇక గడిచిన నెలలో మృతి చెందిన ఫుట్ బాల్ ప్లేయర్ కు నివాళిగా ఆరడుగుల విగ్రహాన్ని తయారు చేశామని, యువత ఫోన్, కంప్యూటర్ అలవాటు పడకుండా మైదానంలోకి వచ్చి ఆటలు ఆడాలని చెప్పిన గొప్ప వ్యక్తి మారడోనా అని బేకరీ వారు పేర్కొన్నారు.

ఇక మారడోనా మరణించడానికి కొన్ని రోజుల కిందట బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ కు సంబంధించి సర్జరీ పూర్తి చేసుకున్న తర్వాత ఇంటికి డిశ్చార్జ్ అయ్యారు.అనంతరం మారడోనా హార్ట్ ఎటాక్ తో మృతి చెందారు.ఇక 20 వ సెంచరీ ఫిఫా ప్లేయర్ అవార్డ్ సొంతం చేసుకున్న జాయింట్ విన్నర్ లలో మారడోనా కూడా ఒకరు.

ప్రస్తుతం మారడోనా కేక్ విగ్రహానికి సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఫోటోలను ఓ ఒక లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube