నెలసరి దాచిపెట్టిందని కోర్టుకెక్కిన భర్త..!

ప్రస్తుత కాలంలో మహిళలకు రక్షణ లేకుండా ఉంటున్న సంగతి అందరికి తెలిసిందే.మహిళలకు ఏదో ఒక విషయంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.

 Husband Goes To Court For Wife Hiding Periods, Gujarat, Husband Goes To Court, W-TeluguStop.com

బయట ప్రపంచంలో వాళ్ళు ఎన్నో ఎదుర్కొని పోరాడుతారు.కానీ ఒక సమస్య వాళ్లని ప్రతినెలా ఇబ్బంది పెడుతున్నప్పటికీ వాళ్ల పోరాటం మాత్రం ఆగదు.

ఇదిలా ఉంటే మహిళలకు ఉన్న సమస్య వల్ల….ఓ వ్యక్తి తన భార్యకు నెలసరి ఉందన్న విషయం అతనికి చెప్పకపోయే సరికి కోర్టుకెక్కిన ఘటన చోటుచేసుకుంది.

వినడానికి వింతగా ఉన్నా… అసలేం జరిగిందో తెలుసుకుందాం.గుజరాత్ లో వడోదరకు చెందిన ఇద్దరు దంపతులు.ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న యువకుడు, టీచర్ గా చేస్తున్న ఓ యువతిని ఈ సంవత్సరం జనవరిలో పెళ్లి చేసుకున్నాడు.దీంతో పెళ్లి తర్వాత గుడికి వెళ్ళేటప్పుడు లోపలికి రానందున… ఆమెను ప్రశ్నించగా పెళ్లి సమయంలో నెలసరి ఉందని తెలిపింది.

దీంతో తనకు నెలసరి ఉందనే విషయాన్ని చెప్పనందుకు ఆమె పై నమ్మకం పోయిందని ఫ్యామిలీ కోర్టులో విడాకులకు సిద్ధమయ్యానని తెలిపాడు.

అందులో ఏం తప్పు ఉందని… అది అందరి మహిళలకు ఉన్న సమస్యే అని ఫ్యామిలీ కోర్టు ప్రశ్నించగా… అతను ఆమె గురించి కొన్ని విషయాలు తెలిపాడు.అతడికి వస్తున్న జీతం ను ఇంట్లో వాళ్ళకి ఇవ్వద్దని గొడవ పెట్టుకునేదట… అంతేకాకుండా తనకు నెలకు రూ.5వేల ఇవ్వాలని కోరేదట.ఇంట్లో ఏసి పెట్టించాలని గొడవ పడేదని… తనకు వస్తున్న జీతం సరిపోదని ఎంత చెప్పినా వినేది కాదని ప్రతి విషయానికి ఏదో రకంగా ఇబ్బంది పెడుతూ ఉండేదని తెలిపాడు.

గొడవ పడిన ప్రతిసారీ వాళ్ళ పుట్టింటికి వెళ్లేదని….

అక్కడికి వెళ్లి ఇంటికి రమ్మని ఎంత చెప్పినా… అక్కడ కూడా పోరు పెట్టేదని తెలిపాడు.ప్రతి చిన్న విషయానికి ఎంతో హింసించే దని….

అంతేకాకుండా తనకు కావాల్సింది ఇవ్వకపోతే టెర్రస్ పైనుంచి దూకి చనిపోతానని బెదిరిస్తూ ఉండేదని తెలిపాడు.దీంతో ఆమె బాధ భరించడం నావల్ల కాదు అంటూ….

అందుకే విడాకులు ఇవ్వాలని అనుకున్నాను అని తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube