ఆ దర్శకుడి తీరుతో చైతన్య హర్ట్ అయ్యారా..?

యంగ్ హీరో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సినిమాల్లో మాస్ సినిమాలతో పోలిస్తే క్లాస్ సినిమాలే బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకున్నాయి.దీంతో నాగ చైతన్య సైతం గత కొన్నేళ్లుగా క్లాస్ సినిమా కథలనే ఎంచుకుంటున్నారు.

 Hero Naga Chaitanya Upset Because Of Sekhar Kammula, Sekhar Kammula, Love Story-TeluguStop.com

మజిలీ, వెంకీమామ విజయాలతో మార్కెట్ ను పెంచుకున్న చైతన్య ప్రస్తుతం లవ్ స్టోరీ, థ్యాంక్యూ సినిమాల్లో నటిస్తున్నారు.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయిపల్లవి హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తైంది.
అయితే షూటింగ్ పూర్తైనా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమవుతున్నాయని దర్శకుడు శేఖర్ కమ్ముల తీరుతో చైతన్య హర్ట్ అయ్యాడని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ అయిన నేపథ్యంలో ప్రేక్షకులు సైతం థియేటర్లలో సినిమాలు చూడటానికి ఆసక్తి చూపుతున్నారు.

లాక్ డౌన్ తర్వాత ఈరోజు థియేటర్లలో విడుదలైన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

Telugu Covid, Nagachaitanya, Love Story, Sai Pallavi, Sankranthi, Sekhar Kammula

సంక్రాంతి పండుగ సమయంలో కూడా తమ సినిమాలను విడుదల చేయడానికి పలువురు టాలీవుడ్ హీరోలు సిద్ధంగా ఉన్నారు.అయితే లవ్ స్టోరీ షూటింగ్ అంతకంతకూ ఆలస్యమవుతూ ఉండటంతో నాగ చైతన్య శేఖర్ కమ్ములపై అసహనంతో ఉన్నారని సమాచారం.అయితే ఈ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

లవ్ స్టోరీ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసే ఛాన్స్ లేకపోవడంతో ఈ సినిమా సమ్మర్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా చైతన్య లుక్ విడుదల కాగా ఆ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

లాక్ డౌన్ కు ముందు కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిబంధనలు సడలించిన తరువాత మిగిలిన భాగం పూర్తి చేసుకుంది.ప్రస్తుతం చైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న థ్యాంక్యూ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube