బిగ్ బాస్ సీజన్ 4 రియాలిటీ షో మొత్తానికి ముగిసింది.ముగింపు వరకు కాస్తా మందకొడిగా సాగిన ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే రోజు మాత్రం అందరిని ఆకట్టుకుంది.
మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి పార్టిసిపెంట్స్ అందరికి సర్ప్రైజ్ లు ఇచ్చారు.దివికి తన వేదాళం రీమేక్ లో కీలక పాత్రలో నటించే ఆఫర్ ఇచ్చాడు.
అలాగే మెహబూబాకి పది లక్షలు ఇచ్చారు.ఇక సోహైల్ బిగ్ బాస్ విన్నర్ కాకుండా ప్రైజ్ మనీ నుంచి 25 లక్షలు బిగ్ బాస్ ఆఫర్ చేయడంతో వాటిని తీసుకున్నాడు.
అదే సమయంలో సోహైల్ కి చిరంజీవి అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు.తాను తీసే సినిమాకి ప్రీరిలీజ్ ఫంక్షన్ కి రావడమే కాకుండా ఛాన్స్ ఉంటె ఒక్క క్యామియో రోల్ చేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని ఆఫర్ ఇచ్చారు.
దీంతో సోహైల్ ఒక్కసారిగా ఉత్సాహంగా ఊగిపోయాడు.అయితే ఇప్పుడు సోహైల్ కి మరో స్టార్ నటుడు నుంచి బంపర్ ఆఫర్ వచ్చింది.
అతనే హాస్య బ్రహ్మ బ్రహ్మానందం.
బ్రహ్మానందం ఈ మధ్యకాలంలో సినిమాలు బాగా తగ్గించేశారు.
స్టార్స్ సినిమాలలో గెస్ట్ అపీరియన్స్ కనిపించి వెళ్లిపోతున్నారు.హార్ట్ ఆపరేషన్ కావడంతో ఇంటి వద్దనే రెస్ట్ తీసుకుంటున్నారు.
ఒకప్పటిలా ప్రతి సినిమాని ఒప్పుకోవడం లేదు.అయితే ఇప్పుడు సోహైల్ కి బ్రహ్మానందం అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు.
సోహైల్ సినిమా తీస్తే అందులో ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా ఫ్రీగా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.ఈ స్టేట్ మెంట్ ఒక్కసారిగా సోహైల్ ని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది అని చెప్పాలి.
ఊహించని వ్యక్తి నుంచి ఊహించని సర్ప్రైజ్ వస్తే ఎవరు ఆనందానికి అవధులు ఉండవు.ఇప్పుడు సోహైల్ పరిస్థితి కూడా అలాగే ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మరి చిరంజీవి, బ్రహ్మానందం ఆఫర్స్ ని సోహైల్ క్యాచ్ చేసుకుంటాడా లేదా అనేది చూడాలి.