సామ్ జామ్ షో కి అభిజిత్.. అప్పుడే ఫిక్స్?

స్టార్ మాలో ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఒక్కసారిగా ఫేమస్ అయిన అభిజిత్ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు పలు సినిమాల్లో నటించినప్పటికీ మంచి ప్రేక్షకాదరణ పొందన్నప్పటికీ ఒక్కసారిగా హౌస్ లోకి ఎంటర్ అయిన తర్వాత అభిజిత్ కు ఎంతోమంది అభిమానులుగా మారిపోయారు.

 Abhijeet  For Samantha Sam Jam Tlk Show, Bigg Boss Fame Abhijeet, Bigg Boss,  Sa-TeluguStop.com

డిసెంబర్ 20 న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కావడంతో ఇప్పటికే అందరు కూడా అభిజిత్ బిగ్ బాస్ ఫోర్ విన్నర్ అని ఫిక్స్ అయిపోయారు.
కానీ బిగ్ బాస్ ఎప్పుడూ ప్రేక్షకుల అంచనాలను తారుమారు చేస్తూ ఎన్నో ట్విస్ట్ లను పెడుతుంటాడు.

కాబట్టి అభిజిత్ విన్నర్ అవుతారా లేక రన్నర్ గా ఉంటారా అనేది తెలియాల్సి ఉంది.ఏది ఏమైనప్పటికీ అభిజిత్ కు మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజిలో ఉందని చెప్పవచ్చు.

బిగ్ బాస్ హౌస్ నుంచి అభిజిత్ బయటకు రాగానే సమంత నిర్వహిస్తున్న సామ్ జామ్ టాక్ షో కి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.దసరా పండుగ స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా బిగ్ బాస్ వ్యాఖ్యాతగా సమంత నిర్వహించిన సంగతి తెలిసిందే అప్పుడు కూడా సమంత చూపు అభిజిత్ పైనే ఉంది.

అప్పుడే అభిజిత్ ను సమంత టాక్ షో కు పిలవాలని ఫిక్స్ అయిపోయినట్టు సమాచారం.

Telugu Abhijeet, Bb Telugu, Bigg Boss, Samantha, Samjam Show-Movie

బిగ్ బాస్ అయిపోయిన తర్వాత అభిజిత్ “ఆహా”యాప్ ద్వారా నిర్వహిస్తున్న సామ్ జామ్ టాక్ షో కి వెళ్తారని తెలుస్తోంది.ఇప్పటికే ఈ షో ద్వారా అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దేవరకొండ, రకుల్, తమన్నా వంటి సెలబ్రెటీలు పాల్గొని వారి వ్యక్తిగత విషయాలను సమంతతో పంచుకొని ఎంతో సందడి చేశారు.అయితే ఈ షోకు త్వరలోనే బిగ్ బాస్ అభిజిత్ కూడా రాబోతున్నాడనే సమాచారం జోరుగా సాగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube