ప్రస్తుతం దొంగతనాలకు పాల్పడే కేటుగాళ్ల కు అంతు లేకుండా పోతుంది.ఒకప్పడు ఎవరు లేని సమయాన ఇళ్లల్లోకి దూరి దొంగతనం చేసే వాళ్ళు.
కానీ ఇప్పుడు పట్టపగలే మారువేషంలో మాయమాటలు చెప్పి ఇళ్లల్లోకి దూరి….ఇంట్లో ఉన్న సభ్యులను బెదిరించి మరి దొంగతనానికి పాల్పడుతున్నారు.
రోడ్డుపైన వెళ్లేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు ఇలా ప్రతి చోటా కాపలా కాస్తూ మహిళల నుండి బంగారమును ఎత్తుకెళ్ళడం, తమ దగ్గర ఉన్న ఆయుధాలతో బెదిరించి మరీ కాజేస్తున్నారు.ఇదిలా ఉంటే హైదరాబాదులో అద్దె కోసం వచ్చి నగదును ఎత్తుకెళ్లిన సంఘటన కలకలం రేపుతుంది.
హైదరాబాద్ లోని మారుతి నగర్ లో నివాసముంటున్న అనంతలక్ష్మి(70).తన ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఆమెను గమనించిన దుండగులు ఇంట్లోకి దూరి దొంగతనానికి పాల్పడ్డారు.కొన్నేళ్ల కింద అనంత లక్ష్మి భర్త మరణించారు.తనకు కూతురు ఉండగా ఆమె వివాహం జరిగింది.
తన ఇంట్లో అద్దె కోసం ఒక పోర్షన్ ఖాళీగా ఉండటంతో టూలెట్ బోర్డ్ ను తగిలించింది.దీంతో ఈ ఇంటిని గమనించిన దుండగుల్లలో ఒకరు టు లెట్ బోర్డు చూసి వచ్చానని….
రూమ్ అద్దెకు కావాలని అనంతలక్ష్మీ ని నమ్మించి ఇల్లు చూపించమని అడిగాడు.దీంతో ఆమె గుడ్డిగా నమ్మి అతనికి ఇల్లు చూపించే సమయంలో వెంటనే మరో వ్యక్తి ఇంట్లోకి దూరాడు.దీంతో ఆ ఇద్దరు దుండగులు కలసి ఆమెను కట్టేసి నోటి నుండి మాట రాకుండా ప్లాస్టర్ కట్టి తన దగ్గర ఉన్న 12 సవర్ల బంగారం, బీరువాలో ఉన్న రూ.5 వేల నగదును తీసుకెళ్లారు.దీనిని గమనించిన ఇంటి చుట్టు పక్కన వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో వెంటనే పోలీసులు డాగ్ స్క్వాడ్ ద్వారా దొంగల గుర్తింపును తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.