ఆ పేరుతో పిలిస్తే అస్సలు నచ్చదంటున్న తమన్నా..?

జయాపజయాలతో సంబంధం లేకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో బిజీగా ఉండే హీరోయిన్లలో తమన్నా ఒకరు.గతంతో పోలిస్తే అవకాశాలు తగ్గినా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ తమన్నా ఒక్కో సినిమాకు కోటి రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

 Heroine Tamanna Interesting Comments About Her Pet Name, Tamanna Bhatia, Milky B-TeluguStop.com

సాధారణంగా హీరోయిన్లు అందంగా కనిపించడానికి మేకప్ వేస్తే తమన్నా మాత్రం మేకప్ లేకుండా కూడా అందంగా కనిపిస్తారు.

పాలలా తెల్లని వర్ణంలో కనిపించే తమన్నాను అభిమానులు ప్రేమతో మిల్కీ బ్యూటీ అని పిలుస్తుంటారు.

చాలా సంవత్సరాల నుంచి తమన్నా నిక్ నేమ్ తో పాపులర్ అయింది.అయితే తనను మిల్కీ బ్యూటీ అని అభిమానులు పిలవడం గురించి స్పందిస్తూ తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తన ఫ్యాన్స్ లో చాలామంది మిల్కీ బ్యూటీ అని పిలుస్తూ ఉంటారని అయితే అలా పిలవడం తనకు అస్సలు నచ్చదని తమన్నా చెప్పుకొచ్చారు.శరీరం యొక్క రంగును బట్టి ముద్దు పేరుతో పిలవడం తన దృష్టిలో తప్పు అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Telugu Tamanna, Milky, Pet, Seeti Maar-Latest News - Telugu

అభిమానులకు తనను తన ఒరిజినల్ నేమ్ తోనే పిలవాలని మిల్కీ బ్యూటీ అని పిలవద్దు అని తమన్నా పరోక్షంగా చెప్పకనే చెప్పారు.శరీరం రంగును బట్టి మిల్కీ బ్యూటీ అని పెట్టిన పేరు పరోక్షంగా వర్ణ వివక్షకు దారి తీస్తుందని.దేశంలో తమ చర్మం పట్ల ఇష్టం, అభిమానం ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు కాబట్టి మిల్కీ బ్యూటీ లాంటి పేర్లు పెట్టి పిలవడం సరికాదని తమన్నా తెలిపారు.

అభిమానులు హీరోయిన్లకు ముదు పేర్లు పెట్టాలనుకుంటే హీరోయిన్ల రంగును చూసి కాకుండా టాలెంట్ ను చూసి పెడితే బాగుంటుందని ఆమె సూచించారు.

హీరోయిన్ తమన్నానే స్వయంగా మిల్కీ బ్యూటీ అని పిలిస్తే తనకు నచ్చదని చెప్పడంతో ఆమె అభిమానులు ఇకపై ఆ పేరుతో పిలవరేమో చూడాల్సి ఉంది.తమన్నా తెలుగులో సీటీమార్, అంథాధూన్ రీమేక్, గుర్తుందా శీతాకాలం సినిమాలతో పాటు ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube