పెద్ద ఎత్తున ఐఫోన్లను ఎత్తుకెళ్లిన సంస్థ ఉద్యోగులు.. ఎందుకంటే..?

తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలోని ఓ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ ఉద్యోగులు వీరంగం సృష్టించారు.ఇందుకు సంబంధించి తైవాన్ దేశానికి చెందిన విస్ట్రాన్ కార్పొరేషన్ సంస్థకు దాదాపు 4540 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని సంస్థ ప్రకటించింది.

 Apple Supplier Wistron Employees Looted Iphones And Damage To Company, Wistron,k-TeluguStop.com

ఈ సంఘటనలో భాగంగా కంపెనీలు తయారు చేస్తున్న ఐఫోన్ లను ఉద్యోగస్తులు తీసుకెళ్ళి పోయారని, వాటితోపాటు అసెంబ్లింగ్‌ పరికరాలు అలాగే బయోటెక్ డివైస్ లను ధ్వంసం చేశారని కంపెనీ వెల్లడించింది.ఇందులో భాగంగానే కంపెనీలో ఉన్న వేలాది సంఖ్యలో ఐఫోన్లను మొత్తం ఉద్యోగులు తీసుకెళ్లిపోయారని కంపెనీ యాజమాన్యం తెలుపుతుంది.

ఈ సంఘటనలో కంపెనీకి 440 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని యాజమాన్యం తెలిపింది.

ఈ దాడిని దృష్టిలో ఉంచుకొని కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది.

కంపెనీ, కార్మికుల మధ్య వివాదం కారణంగానే ఈ సంఘటన జరిగింది.వీరిద్దరి మధ్య గత మూడు నెలలుగా వివాదం కొనసాగుతుండగా విస్ట్రాన్ సంస్థ యూనిట్ కోసం 8900 మందిని పని లో పెట్టుకోవడానికి మొత్తం ఆరు అనుబంధ సంస్థల్లో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కర్ణాటక రాష్ట్ర కార్మిక శాఖ తెలిపింది.

ఈ నియామకాలకు సంబంధించి కంపెనీలో వివాదమేకారణమై ఉండవచ్చని పరిశ్రమల శాఖ మంత్రి జగదీష్ తెలిపారు.అయితే ఈ నిరసన సందర్భంగా జరిగిన హింసను తమ ప్రభుత్వం ఖండిస్తునట్లు, ఈ సంఘటనకు తీసుకోవాల్సిన చర్యలు వెంటనే తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది.

కంపెనీ ఆస్తులకు నష్టం కలిగించిన వారిపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవడానికి అయినా తాము సిద్ధంగా ఉన్నామని కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అశ్వత్ నారాయణ తెలిపారు.

Telugu Applesupplier, Karnataka, Wistron-Latest News - Telugu

ఈ విషయంపై ఇప్పటికే దర్యాప్తు ప్రక్రియ మొదలైందని.ఇందుమూలంగా ముఖ్యంగా కార్మికులకు జీతం చెల్లింపులపై ఫిర్యాదులు వచ్చిన కారణంగా ఆ అంశంపై ముందుగా పరిశీలిస్తున్నామని అధికారులు తెలుపుతున్నారు.కంపెనీలో పని చేసేందుకు ఫస్ట్ షిఫ్ట్ లో పనికి వచ్చిన దాదాపు 2000 మంది వారికి ఇంకా జీతాలు చెల్లించకపోవడంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకొని కంపెనీ ప్లాంట్ పై దాడి చేశారు.

ఫర్నిచర్ ను ధ్వంసం చేయడమే కాకుండా కంపెనీకి చెందిన వాహనాలను కూడా నిప్పు అంటించారు ఉద్యోగస్తులు.అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 132 మంది ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube