టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ దర్శకుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి సరిలేరు సినిమా తర్వాత ఎఫ్2 సీక్వెల్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఎఫ్3తో ఈ సారి మరింత ఫన్ అందించడానికి అనిల్ రావిపూడి రెడీ అవుతున్నాడు.ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.
ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ తో పాటు మరో స్టార్ హీరో కూడా కనిపించబోతున్నాడు.అయితే అతను ఎవరనే విషయాన్ని ఇంకా అనీల్ రివీల్ చేయలేదు.
అయితే ఇందులో రవితేజ నటిస్తున్నాడని టాక్ మాత్రం వినిపిస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో కూడా తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు.ఎఫ్2కి కొనసాగింపుగానే ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా అనిల్ రావిపూడి ఎఫ్3 కాన్సెప్ట్ పోస్టర్ ని రివీల్ చేశాడు.
ఈ పోస్టర్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ డస్టబిన్ తీసుకెళ్లే తోపుడు బళ్ళు డబ్బుతో తోసుకెళ్తున్నట్లు డిజైన్ చేశారు.ఈ పోస్టర్ బట్టి సినిమా కాన్సెప్ట్ డబ్బుతో కనెక్ట్ అయ్యి ఉంటుందని తెలిసిపోతుంది.
దర్శకుడు అనిల్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు.ఈసారి మూడింతల వినోదం కోసం ప్రేక్షకులు సిద్ధంగా ఉండండి అంటూ ఈ సినిమా గురించి ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.
కథ డబ్బుల చుట్టూ తిరిగినప్పుడు ఫన్ పీక్స్‌లో ఉంటుంది కదా అని అనిల్ రావిపూడి చెప్పారు.ఇక డిసెంబర్ నెల ఆఖరున ఈ సినిమాని అఫీషియల్ గా స్టార్ట్ చేసి సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత షూటింగ్ కి వెళ్ళబోతున్నట్లు తెలుస్తుంది.