మిమ్మల్ని చూసి భారతీయులు గర్విస్తున్నారు: కమలా హారిస్‌పై కేంద్ర మంత్రి ప్రశంసలు

అమెరికాకు తొలి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌కు ప్రపంచ నలుమూలల నుంచి ఇంకా ప్రశంసలు వెల్లువెత్తుతూనే వున్నాయి.మనదేశం విషయానికి వస్తే ప్రధాని నరేంద్ర మోడీ సహా ఇతర ప్రముఖులు ఆమెను ఇప్పటికే అభినందించారు.

 Indians Are Proud Of Kamala Harris And Wish Her Success: Union Minister, Union M-TeluguStop.com

తాజాగా కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ కమలా హారిస్‌ను ఆకాశానికెత్తేశారు.జనవరి 9న జరిగే ప్రవాసీ భారతీయ దివాస్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR), విదేశాంగ శాఖకు చెందిన విభాగాలు సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో మురళీధరన్‌ మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆమె సాధించిన విజయాలను మురళీధరన్ గుర్తుచేశారు.

కమలను చూసి భారతీయులు గర్వపడుతున్నారని… భారతీయ మూలాలున్న వ్యక్తులు ఆయా దేశాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవడం గొప్ప విషయమన్నారు.వివిధ దేశాల్లో రాజకీయాలు, ఆర్ధిక రంగం, పరిశ్రమలు, టెక్నాలజీ, విద్యారంగంలో భారతీయులు కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదిగారని మంత్రి గుర్తుచేశారు.

అవకాశాల కోసం ఇతర దేశాలకు వలస వెళ్లినప్పటికీ, ప్రవాస భారతీయులు దేశ సంస్కృతి, సంప్రదాయాల్లో ఎప్పటికీ భాగంగానే ఉంటున్నారని మురళీధరన్ చెప్పారు.

Telugu America, Indiansproud, Januaryth, Kamala Harris, Muralidharan-Telugu NRI

కమలా హారిస్‌తో పాటు భారతీయ మూలాలు ఉన్న గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ, సురినామె దేశ అధ్యక్షుడు చంద్రిక పేర్సాద్ సంతోకిలను మురళీధరన్ గుర్తుచేసుకున్నారు.అంతేకాకుండా ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన చాలామంది నాయకులు విజయం సాధించారని.అమెరికన్‌ కాంగ్రెస్‌, సెనేట్‌లోనూ భారత మూలాలున్న నాయకులు ఉన్నారని తెలిపారు.

వారి విజయాలు భారతీయులందరికీ గర్వకారణం అని ఆయన చెప్పారు.విదేశాల్లో స్థిరపడినప్పటికీ భారతీయులు దేశ జాతీయ భద్రత, ఆర్ధిక ప్రయోజనాలకు కృషి చేస్తున్నారని మురళీధరన్ ప్రశంసించారు.

ఎక్కడ ఉన్నా భారతీయులు దేశ ప్రయోజనాలకు ఏదో ఒక విధంగా పాటుపడుతున్నారని చెప్పారు.న్యూ ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్ వంటి విధానపరమైన నిర్ణయాల ద్వారా దేశాభివృద్ధికి కృషి చేస్తున్నామని, ఇలాంటి కార్యక్రమాల్లో ప్రవాస భారతీయులు కూడా భాగం కావాలని ఆయన కోరారు.

Telugu America, Indiansproud, Januaryth, Kamala Harris, Muralidharan-Telugu NRI

జనవరి 9, 1915 న దక్షిణాఫ్రికా నుంచి జాతిపిత మహాత్మా గాంధీ తిరిగి ముంబైకి తిరిగి వచ్చిన సందర్భంగా ప్రవాస భారతీయుల దినోత్సవము జరుపుకుంటారు.భారతదేశ అభివృద్ధికి విదేశాల్లో స్థిరపడిన భారతీయులు అందిస్తున్న తోడ్పాటును గుర్తించేందుకు ఈ కార్యక్రమం వేదికవుతోంది.భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమాఖ్య (ఎఫ్ఐసీసీఐ), భారత పరిశ్రమల సమాఖ్య సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube