ఒక్క ఎపిసోడ్‌ తో సోహెల్‌ గ్రాఫ్‌ పడిపోయింది

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 ముగింపు దశకు వచ్చేసింది.ప్రస్తుతం హౌస్‌లో ఆరు మంది మాత్రమే ఉన్నారు.

 Sohel Andi Ariyana Issue In Telugu Bigg Boss , Sohel, Ariyana, Fight, Bigg Boss4-TeluguStop.com

ఈ వారం ఒకరు ఎలిమినేట్‌ అవ్వబోతున్నారు.మిగిలిన 5 మంది ఫైనల్‌ వారంకు వెళ్లనున్నారు.

వారు ఎవరు అనే విషయంలో పూర్తి స్పష్టత ఉంది.హారిక లేదా మోనాల్‌ ల్లో ఒకరు ఎలిమినేట్‌ అయ్యి పోవబోతున్నారు.

ఇక మిగిలిన వారు టైటిల్‌ కోసం పోరాటం చేస్తారు.టాప్‌ 5 లో కూడా అభిజిత్‌ మరియు సోహెల్‌ లతో పాటు అరియానా చాలా గట్టిగా ట్రోఫీ కోసం పోరాటం చేసే అవకాశం ఉందని అంటున్నారు.

సోహెల్‌ ఒకానొక సమయంలో విజేతగా కూడా నిలుస్తాడా అనే టాక్‌ వచ్చింది.సోహెల్‌ మంచి కంటెస్టెంట్‌ గా అనుకుంటున్న సమయంలో నిన్నటి ఎపిసోడ్‌ తో మొత్తం పోగొట్టుకున్నాడు.

మొదటి నుండి అతడికి కోపం ఎక్కువ అంటూ ప్రచారం ఉంది.అది నిన్నటి ఎపిసోడ్‌ లో మరీ రచ్చ అయ్యింది.

దాంతో సోషల్‌ మీడియాలో అతడిని పిచ్చి కుక్కతో పోల్చుతూ ట్రోల్స్‌ చేస్తున్నారు.

Telugu Abhijeet, Abhijith, Akhil, Ariyana, Bb, Bigg Boss, Netizens Trolls, Sohel

అమ్మాయితో మాట్లాడటం ఆమెను డీల్‌ చేయడం రాని సోహెల్‌ బిగ్‌ బాస్‌ విజేత ఎలా అవుతాడు అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు.సోహెల్‌ నిన్నటి ఎపిసోడ్‌ తో చాలా బ్యాడ్‌ అయ్యాడు.అనూహ్యంగా అతడు ట్రోఫీకి చాలా దూరం అయ్యాడు అనడంలో సందేహం లేదు.ప్రతి ఒక్కరు కూడా సోహెల్‌ తీరును తప్పుబడుతున్నాడు.అమ్మాయి రెచ్చగొట్టినంత మాత్రాన అంతగా ఆమెపైకి దూసుకు వెళ్లడం ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు.ఆమె తన ఫీలింగ్స్‌ ను వ్యక్తం చేసినట్లుగానే ఇప్పుడు సోహెల్‌ వ్యక్తం చేయాల్సి ఉంది.అంతే తప్ప మరీ అంత అగ్రెసివ్‌ అవ్వకుండా ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

మొత్తానికి సోహెల్‌ అలా అలా పైకి తీసుకు వెళ్లిన గ్రాఫ్‌ నిన్నటి ఎపిసోడ్‌ తో తుస్‌ మంది.ఈ వారం ఎలిమినేష్‌ కాకున్నా కూడా టాప్‌ 3 లో సోహెల్‌ ఉండే అవకాశం లేదు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube