'సలార్‌' కోసం కావాలంటూ ప్రకటన

ప్రభాస్‌ హీరోగా రూపొందబోతున్న సలార్‌ సినిమా కోసం మొత్తం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు అనడంలో సందేహం లేదు.ఎందుకంటే ప్రభాస్ కు బాహుబలి.

 Prashanth Neel Auditions For Salaar Movie, #salar, Prabhas, Prashanth Neel, Sala-TeluguStop.com

సాహో సినిమాలతో ఆల్‌ ఇండియా క్రేజ్ వచ్చింది.ఇక కేజీఎఫ్‌ సినిమాతో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కూడా ఆల్‌ ఇండియా క్రేజ్‌ ను దక్కించుకున్నాడు.

అలాంటి వీరిద్దరి కాంబోలో మూవీ అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.భారీ యాక్షన్‌ సినిమాగా సలార్‌ ను ప్రకటించాడు.

ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రాబోతున్న సలార్‌ సినిమా షూటింగ్‌ మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సినిమా కోసం కొంత మంది నటీనటులు కావాలంటూ దర్శకుడు ప్రకటన ఇచ్చాడు.

అన్ని భాషలకు చెందిన వారు అన్ని వయసుల వారు వారి వారి వీడియోలను వెంటనే పంపించండి అంటూ అధికారికంగా ప్రకటించారు.సలార్‌ కోసం ఆడిషన్స్‌ ఏంటో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎంతో మంది ప్రముఖ నటీనటులు ఉన్నారు.వారిని తీసుకోవచ్చు కదా కొత్త వారు ఎందుకు అంటున్నారు.

చాలా మంది ఇండస్ట్రీలో ఇప్పటికే ఉన్నారు.వారినే సినిమా తీసుకుంటే వెయిట్‌ కూడా పెరుగుతుందనే అభిప్రాయంతో కొందరు ఉన్నారు.

కాని ప్రశాంత్‌ నీల్‌ మాత్రం ఏదో ఉద్దేశ్యంతో అన్ని భాషలకు చెందిన వారు తన సినిమాలో నటించాలనుకుంటున్నట్లుగా చెబుతున్నాడు.కొత్త వారిని ఎంపిక చేసేందుకు ఈయన చూపిస్తున్న శ్రదకు అంతా కూడా ఫిదా అవుతున్నారు.

అన్ని భాషల నుండి దాదాపుగా పాతిక మందిని ఈ సినిమా కోసం దర్శకుడు ఎంపిక చేస్తాడనే వార్తలు వస్తున్నాయి.మరి ఇది ఎంత వరకు వర్కౌట్‌ అయ్యేను అనేది చూడాలి.

మీకు ఆసక్తి ఉంటే వెంటనే వీడియో చేసి పంపండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube