పొట్ట దగ్గర కొవ్వు కరగాలంటే ఇవి తినాల్సిందే..!

ప్రస్తుతం అనేక మంది కరోనా వైరస్ నేపథ్యంలో ఇంటి దగ్గరే ఉండి ఉద్యోగాలు నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.దీంతో చాలామంది ఇంట్లోనే కూర్చొని పనిచేయడం ద్వారా ఎక్కువ మందికి పొట్ట దగ్గర ఎక్కువగా కొవ్వు పేరుకుపోవడం లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

 Fat, Stomach, Health Tips, Home Remedis, Health Fittnesscalifower,cabbage,metaba-TeluguStop.com

ఇలా పొట్ట వద్ద కొవ్వు పేరుకుపోవడంతో వారి పొట్ట భారీగా పెరగడం దానిని చూడటానికి అందవిహీనంగా కనపడటంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి.ఇలా ఉన్న సమయంలో వారు బయటికి వెళ్లినప్పుడు నలుగురిలో కాస్తా చూడటానికి ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తుంది.

కేవలం అందం పరంగా మాత్రమే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా ఉత్పన్నం అవుతున్నట్లు కొందరు డాక్టర్ తెలుపుతున్నారు.కొందరు డాక్టర్లు ఇచ్చిన సూచన మేరకు ఇలా పొట్ట వద్ద అధికంగా కొవ్వు పేరుకుంటే శరీరంలో గుండెజబ్బులు అలాగే డయాబెటిస్ చెందిన సమస్యలు అతి త్వరగా రావడానికి అవకాశం ఉన్నట్లు వారు తెలిపారు.

పొట్ట దగ్గర కొవ్వు ను కరిగించుకోవాలి అంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటే శరీరంలో ఉన్న కొవ్వు పదార్థాలను తగ్గించేందుకు అవకాశం ఉంటుంది.ఇందులో ముఖ్యంగా కూరగాయలు తీసుకుంటే శరీరంలోని కొవ్వు తగ్గుతుందో ఓసారి చూద్దామా.

మన శరీరంలోని ఉన్న కొవ్వును తగ్గించుకోవాలి అంటే ముందుగా మనం గుమ్మడి కాయ తీసుకోవడం ద్వారా మంచి ఫలితం లభిస్తుంది.గుమ్మడికాయ ని కేవలం ఒక తీపి పదార్థంలా కాకుండా ఒక కూరగాయల మాత్రమే దీనిని ఉపయోగిస్తే శరీరం బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

అలాగే మిరపకాయలను తింటే కారం అవుతుందని మన అందరికీ తెలిసిన విషయమే.కాకపోతే వీటిని తినడం వల్ల మన శరీరంలో కొవ్వు కరుగుతుంది అని చాలా మందికి తెలియదు.

వీటిని తినడం ద్వారా శరీరంలో కాస్తా ఉష్ణోగ్రత పెరగడం ద్వారా శరీరంలో ఉండే వేడికి కొవ్వు కరుగుతుంది.

వీటితోపాటు వారానికి రెండు లేదా మూడు సార్లు పుట్టగొడుగులు తీసుకోవడం ద్వారా డయాబెటిస్ సమస్యను తగ్గించుకోవచ్చు.

అంతేకాదు, అధిక బరువు సమస్యను కూడా చాలావరకు తగ్గించవచ్చు.దీనికి కారణం పుట్టగొడుగుల్లో ఉన్న ప్రోటీన్లు మన శరీరంలో మెటబాలిజం ను బాగా పెంచుతాయి.

దీంతో కొవ్వు బాగా కరుగుతుంది.వీటితో పాటు కాలీఫ్లవర్, క్యాబేజీ లను తీసుకోవడం ద్వారా శరీరంలో అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

వీటివల్ల మనకు అనేక రకాల విటమిన్లు లభిస్తాయి.వీటితో పాటు ఆకుపచ్చని కూరగాయలు, అలాగే ఆకుకూరలు ఏవైనా సరే ఎక్కువ మోతాదులో తీసుకోవడం ద్వారా మీ శరీరంలో కొవ్వు తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

ఆకుకూరల్లో ముఖ్యంగా పాలకూరను ఉపయోగిస్తే మీ శరీరంలోని కొవ్వును కరిగించడంలో ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube