ద్రౌపది కోసం ప్రత్యేక ఆలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా?

సాధారణంగా మనదేశంలో ఎక్కడికి వెళ్ళిన మనకు దుర్గామాత, శివుని ఆలయాలు, విష్ణు దేవాలయాలు ఎక్కువగా దర్శనమిస్తుంటాయి.ఆ దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి అనుగ్రహం పొందుతుంటారు.

 Draupadi Temples In India, Draupadi Temples,india,darmadaya Temple,bangalore,ap,-TeluguStop.com

కానీ మీరు ఎప్పుడైనా ద్రౌపది కోసం ఆలయాలు నిర్మించారని మీకు తెలుసా? పాండవులను వివాహమాడిన ద్రౌపదికి ఆలయాన్ని నిర్మించి, భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.అయితే మనదేశంలో ఈ ద్రౌపది ఆలయాలు ఎక్కడ ఉన్నాయో? ఆ ఆలయం యొక్క విశిష్టత ఏమిటో? ఇక్కడ తెలుసుకుందాం…

Telugu Bangalore, Chittore, India-Latest News - Telugu

బెంగళూరులోని ఎంతో ప్రసిద్ధి చెందిన ధర్మదాయ దేవాలయం ఉంది.ఈ ఆలయంలో పాండవులు, ద్రౌపదికి భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు.ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కరగ పండుగ పేరిట పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుతారు.

ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తారు.

Telugu Bangalore, Chittore, India-Latest News - Telugu

అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో యమిగాని పల్లెల్లో ధర్మరాజుకు దేవాలయం ఉంది.ఈ దేవాలయంలోనే ద్రౌపదినీ కూడా పూజిస్తారు.పుత్తూరు సమీపంలోని ఒక గ్రామంలో ఆరుగురు అన్నదమ్ములు కలిసి ఒక బావిని తవ్వుతుండగా ఈ విగ్రహం బయట పడినట్లు పురాణాలు చెబుతున్నాయి.

అయితే ఆరుగురిలో చిన్నవాడైన చినతంబికి ద్రౌపది కలలో కనిపించి వారికి ఆలయం నిర్మించాలని కోరారు.ఈ విధంగా విరాళాలను సేకరించి ఆలయాన్ని నిర్మించారు.
ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఈ ఆలయంలో 18 రోజుల పాటు ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.అప్పట్లో బ్రిటిష్ వారు కూడా ఈ ఆలయాన్ని సందర్శించినట్లు చరిత్ర చెబుతోంది.

ఈ ఆలయంలో సంతానం లేని వారు ప్రత్యేక పూజలను చేయడం ద్వారా వారికి తొందరగా సంతానం కలుగుతుందని ప్రగాఢ నమ్మకం.అందుకే ఈ ప్రాంతంలో ద్రౌపది దేవిని సంతానలక్ష్మి గా పూజిస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube