మరో 43 యాప్ లను బ్యాన్ చేసిన కేంద్రం!

చైనాతో సరిహద్దు ప్రాంతాలలో ఘర్షణల నేపథ్యంలో భారతదేశం సమాచార గోప్యతా దృష్ట్యా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయిన టిక్ టాక్ తో పాటు ఆ దేశానికి సంబంధించిన మరో 59 యాప్ లను భారత ప్రభుత్వం జూన్ 29న నిషేధించింది.ఇదే తరహా లోనే సెప్టెంబర్ నెలలో చైనా రూపొందించిన పబ్జీ ఆన్లైన్ గేమ్ తో సహా మరో 118 చైనా యాప్ లను భారత ప్రభుత్వం నిషేధించినట్లు మనకు తెలిసినదే.

 43more Apps Banned In India, China Apps, Ali Express, Security Reasons, China Ap-TeluguStop.com

ఇప్పటికే పలురకాల చైనా యాప్ లను తొలగించిన భారత ప్రభుత్వం మరోసారి చైనా మొబైల్ యాప్ లపై కొరడా ఝుళిపించింది. భారతదేశ సార్వభౌమత్వం, భద్రత దృష్ట్యా చైనా యాప్ లు భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మరో 43 చైనా యాప్ లను కేంద్ర హోం శాఖ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ చైనా యాప్ పై నిషేధం విధించినట్లు కేంద్రం ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.

Telugu Apps India, Ali Express, Central, China Apps, China Apps Ban, India, Apps

భారత దేశంలో తాజాగా బ్యాన్ చేసిన వాటిలో అలీఎక్స్‌ప్రెస్‌, స్నాక్‌ వీడియో, మ్యాంగో టీవీ ఉన్నాయి.ఐటీ చట్టం 69ఎ సెక్షన్‌ ప్రకారం కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఈ చర్యలను తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.తాజాగా నిషేధించిన ఈ యాప్ లలో చైనా రిటైల్ దిగ్గజం కంపెనీ అలీబాబా గ్రూప్ కి చెందిన నాలుగు యాప్ లతో పాటు మరికొన్ని యాప్ లను భారతదేశంలో నిషేధించినట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
గతంలో గల్వాన్ లోయ వద్ద భారత్ పై చర్యలకు పాల్పడిన చైనా ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు భారత ప్రభుత్వం కొన్ని రకాల చైనా యాప్ లను నిషేధించిన విషయం మనకు తెలిసినదే.

అయితే ప్రస్తుతం మన దేశ భద్రత రీత్యా మరికొన్ని చైనా యాప్ లను బ్యాన్ చేసినట్లు భారత ప్రభుత్వం తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube